వినికిడి సమస్యలకు యువత అతిదగ్గర్లో ఉంది జాగ్రత్త!
కొత్త పరిశోధన
ఇప్పటి ప్రపంచ యువతలో 1.1 బిలియన్ టీనేజ్ పిల్లలు వినికిడి సమస్యలకు అతి దగ్గర్లో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, ఐ-పాడ్స్ వంటి అత్యాధునిక ఉపకరణాలను యధేచ్ఛగా వాడుతున్న యువత ఎప్పుడూ ఇయర్‌ఫోన్లతో సంభాషణ చేస్తుండటం, సంగీతం వినడం కోసం నిత్యం ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగిస్తూ ఉండటం వల్ల వారు వినికిడి సమస్యల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
అత్యధిక ఆదాయ దేశాల నుంచి ఒక మోస్తరు ఆదాయ దేశాల్లోని 12 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత అవసరమైన మోతాదు కంటే ఎక్కువ శబ్దాలను వింటూ తమ చెవులకు శ్రమ కలిగిస్తున్నారని, వీరిలో 40 శాతం మంది యువత నైట్‌క్లబ్స్, పబ్స్ వంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వినికిడి సమస్యలకు తామే ఆహ్వానం పలుకుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంటోంది. పై వినోద ప్రదేశాలలో చాలా ఎక్కువ శబ్దం ఉంటోందనీ, కేవలం 85 డెసిబల్స్ నుంచి 100 డిసిబల్స్ శబ్దానికి 15 నిమిషాలపాటు ఎక్స్‌పోజ్ కావడమే చెవిలోని సెన్సరీ కణాలకు తీవ్రంగా నష్టం చేస్తుందనీ, ఇది మళ్లీ రిపేర్ చేసేందుకు కూడా వీలుకాని నష్టమని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌ఓ!