కాస్మొటిక్స్‌ విక్రయించిన సమంత | Samantha sold Cosmetics in the part of tv show | Sakshi
Sakshi News home page

కాస్మొటిక్స్‌ విక్రయించిన సమంత

Published Thu, Sep 22 2016 8:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

కాస్మొటిక్స్‌ విక్రయించిన సమంత - Sakshi

కాస్మొటిక్స్‌ విక్రయించిన సమంత

మాసబ్‌ట్యాంక్‌: ఓ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ‘మేము సైతం’ ద్వారా అందాల తార సమంత చేసిన వినూత్న ప్రయత్నాన్ని జెమిని టీవీ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న సూర్య ప్రకాష్‌ కుటుంబం కోసం లేడీస్‌ కాస్మొటిక్స్, మహిళల అలంకరణ వస్తువులను విక్రయించడం ద్వారా ఆమె చేయూతనందించింది.

వెంకటేశ్వరరావు కొడుకు సూర్యప్రకాష్‌ రెండు కిడ్నీలు పాడవడంతో తన కిడ్నీ ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇన్ఫెక్షన్‌తో ఆ కిడ్నీ కూడా చెడిపోవడంతో అప్పు చేసి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయనకు ‘మేముసైతం’ బాసటగా నిలిచింది. సమంత చేసిన వినూత్న ప్రయత్నం జెమినిలో శనివారం ప్రేక్షకులు ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement