
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజును ఖరారుచేసింది. ఫీజు కింద సదరు ఆస్తి విలువలో 0.1 శాతం లేదంటే రూ.800 (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం జీవో నంబర్–46 విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రమంతటా గ్రామ పంచాయతీల పరిధిలోని వ్యవసాయేతర స్థిరాస్తులపై హక్కుల బదిలీ కోసం ఒకేరకమైన ఫీజు వసూలు చేస్తారు.
గతంలో గ్రామ పంచాయతీల తీర్మానం మేరకు ఆయా గ్రామాల్లో మ్యుటేషన్ ఫీజు నిర్ధారించే ఆనవాయితీ ఉంది. దీంతో మ్యుటేషన్ ఫీజు ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఉండేది. తాజా ఉత్తర్వులతో మ్యుటేషన్ ఫీజు ఖరారు అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదు. ధరణి ద్వారా గ్రామాల్లోనూ ఏకరూప రుసుము అమలవుతుంది. క్రయవిక్రయాలు, వారసత్వ హక్కుల బదిలీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల వంటి లావాదేవీలకు ఇది వర్తి స్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment