సెస్‌లు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా కుదరదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటా పంపిణీలో పనితీరు బాగా ఉన్న రాష్ట్రాలకు అన్యా యం జరుగుతోందనే ఆరోపణలను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా తోసిపుచ్చా రు. పంపిణీ చేయదగిన కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు 41 శాతాన్ని పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, చట్టరీత్యా తప్పనిసరిగా కేంద్రం పంపిణీ చేయాల్సిందేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నికర పన్నుల ఆదా యంలో సెస్‌లు, సర్‌చార్జీలు సైతం కలిసి ఉంటాయని, వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడం కుదరదన్నారు. సెస్‌లు, సర్‌చార్జీలను సైతం లెక్కించి కేంద్రం రాష్ట్రాలకు 31 లేదా 32 శాతం నిధులు మాత్రమే ఇస్తోందని రాష్ట్రాలు అంటున్నాయని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌చార్జీల్లో సైతం రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సిఫారసు చేస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా, ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదంటూనే.. సెస్‌లు, సర్‌చార్జీలను వసూలు చేసి 100 శాతం తీసుకునే అధికారం కేంద్రానికి రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రణాళికలు భేష్దేశంలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతని స్తుండడంతో పట్టణాభివృద్ధి నిర్లక్ష్యానికి గురవు తోందని, తెలంగాణ ఈ విషయంలో చాలా ముందుచూపుతో వెళ్తోందని అరవింద్ పనగరి యా ప్రశంసించారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం వేసిన ప్రణాళికలు ఒక ఆర్థికవేత్తగా తనను ఆకట్టుకున్నాయన్నారు. ఆర్థిక ప్రణాళికల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, ప్రభుత్వం వివరించిన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు తమను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి భారంగా మారిన రుణాల రీస్ట్రక్చరింగ్ అంశం తమ పరిధిలోకి రాదని వివరించారు.జీఎస్డీపీ ఆధారంగా నిధుల పంపిణీని రాష్ట్రం కోరిందిఏ ప్రాతిపదికన కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? అనే అంశంపై రాష్ట్రం సూచనలు చేసిందని పనగరియా చె ప్పారు. జీడీపీకి ఒక్కో రాష్ట్రం అందిస్తున్న చేయూ త, ఆయా రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీ పీ)ని ప్రామాణికంగా తీసుకుని 28 రాష్ట్రాల మధ్య సమానంగా (హారిజాంటల్గా) నిధుల పంపిణీ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాము 6 రాష్ట్రాల్లో పర్యటించగా, కర్ణాటక, తెలంగాణ ఈ తరహా డిమాండ్ చేశాయని తెలిపారు. రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని చెప్పారు. తాము ఇంకా 20కి పైగా రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని తెలిపారు.ఏం సిఫారసులు చేస్తామో ఇప్పుడే చెప్పలేం2026–27 నుంచి 2030–31 మధ్య ఐదేళ్ల కా లంలో కేంద్ర పన్నుల ఆదాయం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ, రాష్ట్రాల వాటా నిధు లు మళ్లీ రాష్ట్రాల మధ్య పంపిణీ, కేంద్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలు, మున్సిపా లిటీలకు నిధుల పంపిణీ, విపత్తుల నిర్వహణ కు నిధుల పంపిణీ విషయంలో కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు చేయనుందని పనగరియా వివరించారు. అయితే ఎ లాంటి సిఫారసులు చేస్తామో ఇప్పుడే వెల్ల డించలేమన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫా రసులనే కేంద్రం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శలున్న నేపథ్యంలో, 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఏం విలువ ఉంటుందని జర్నలిస్టులు ప్రశ్నించగా.. కేంద్రం, రా ష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, స్థానిక సంస్థ లు, విపత్తుల నివారణకు నిధుల పంపిణీ విషయంలో తమ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర సిఫారసుల అమలు కేంద్రంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, జార్జి మాథివ్, మనోజ్ పాండ, సౌమ్య కంటి ఘోష్ సమావేశంలో పాల్గొన్నారు.