విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : మాటలు ఓరకం.. చేతలు మరో విధం.. ప్రభుత్వం వ్యవహార సరళి సర్వదా సమస్యాత్మకం.. పొంతనలేని ఈ వ్యవహారం వల్లే గ్రామీణాభివృద్ధి కుంటుపడుతోందన్నది విస్పష్టం. ఓవైపు గ్రామీణాభివృద్ధి శాఖల్లో సిబ్బంది లేక పనులు కుంటుపడుతూ ఉంటే, మరోవైపున ఖాళీల భర్తీలు కుంటుపడుతున్నాయి. దాంతో అటు నిరుద్యోగులు ఉసూరంటున్నారు.. ఇటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం మళ్లీ అరకొరగానే నియామకాలు చేపడుతూ ఉండడమే విచి త్రం.
వందల సంఖ్యలో ఖాళీలు ఉంటే ప దుల సంఖ్యలో పోస్టులను నింపడానికి సి ద్ధమైంది. పంచాయతీ కార్యదర్శుల పోస్టు ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీపీఎస్‌సీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. అయితే జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఇందులో 660 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఒక్కో కార్యదర్శికి అయిదారు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. దీంతో సిబ్బంది తీవ్ర పని ఒత్తిడితో అవస్థలు పడుతున్నారు.
ఇటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో నియామక ప్రక్రియను చేపట్టకుండా కేవలం 155 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. క్లస్టర్స్‌కు ముందు కార్యదర్శులను నియమించి వారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంకా 505 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండిపోనున్నాయి. పోస్టుల భర్తీ తర్వాత కూడా గ్రామ పంచాయతీల పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో పోస్టులను భర్తీ చేస్తే సిబ్బంది కొరత తీరడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఖాళీలు బోలెడు..భర్తీ బెత్తెడు!
Published Tue, Dec 31 2013 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement