హెల్మెట్ ఉంటేనే ఆర్టీఏకు రండి
అవగాహనార్యాలీలో సుల్తానియా
సాక్షి, హైదరాబాద్ : ‘బాధ్యతగా హెల్మెట్ ధరిం చండి. ప్రాణాలను కాపాడుకోండి. మీ కోసం మీ కుటుంబం ఎదురు చూస్తోందనే విషయాన్ని మరచి పోవద్దు.’ అని రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా వాహనదారులకు అన్నారు. హెల్మెట్‌లేని వాహనదారులను ఆర్టీఏ కార్యాల యాల్లోకి అనుమతించబోమని చెప్పారు. శనివారం ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సుల్తానియా మాట్లాడుతూ హెల్మెట్ ధరించాలనే నిబంధన కొత్తగా వచ్చిందికాదన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో 25 శాతం మంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారేనని ఆం దోళన వ్యక్తం చేశారు. కాలేజీలు, విద్యాసంస్థలు, నగరంలోని ప్రధానకూడళ్లలో హెల్మెట్‌పై విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సం యుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. ఖైరతాబాద్ నుంచి సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డు, రాజీవ్ చౌరస్తా, పంజగుట్ట, ఎర్రమంజిల్ మీదుగా తిరిగి రవాణా కమిషనర్ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారులు జీపీఎన్ ప్రసాద్, దశరథం, లక్ష్మి, పలువురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయం వద్ద జరిగిన హెల్మెట్ అవగాహనర్యాలీని రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు.