mutation fee
-
పురపాలికలకు అందని రూ. 2,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక ప్రజలకు కనీస సేవలు కూడా చేయలేకపోతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సాయం అందడం లేదు. పట్టణాలు, నగరాల్లో ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలతోపాటు కుటుంబ వారసత్వ పంపకాల సమయంలో రిజి్రస్టార్లు మ్యుటేషన్ ఫీజుల రూపంలో ఫీజు వసూలు చేస్తారు. అలాగే భూ హక్కుల బదిలీ కింద ట్రాన్స్ఫర్ డ్యూటీలు, సేవా పన్నులు సైతం కట్టించుకుంటారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసినప్పటికీ, ఇందులో మ్యుటేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా వాటా ఇవ్వాలి. అయితే 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు పురపాలికలకు రావాల్సిన రూ. 2,500 కోట్ల విలువైన మ్యుటేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీలు విడుదల కాలేదు. దీంతో పట్టణాల్లో ఎన్ని భూ లావాదేవీలు జరుగుతున్నా ఆయా మున్సిపాలిటీలకు పైసా లాభం ఉండట్లేదు. కొన్ని పురపాలికల్లో కాలువల్లోని పూడిక తీయడానికి, చెత్త ఎత్తే ట్రాక్టర్లకు డీజిల్ పోయించడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. మ్యాచింగ్ గ్రాంట్ రూ. 800 కోట్లు స్థానిక సంస్థలను పరిపుష్టం చేసేందుకు కేంద్రం ఏటా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ వస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆయా పట్టణ పాలకమండళ్లకు రూ. 800 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ రూ. 800 కోట్లు ఇంకా విడుదల కాలేదు. ఈ మొత్తం విడుదలై యుటిలైజేషన్ సరి్టఫికెట్ (యూసీ) పంపిస్తేనే తిరిగి మున్సిపాలిటీలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పట్టణ ప్రగతి కింద ప్రతి మున్సిపాలిటీలో దోబీఘాట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ మేరకు చాలా మున్సిపాలిటీల్లో పనులు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే దోభీఘాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణాలకు రూ. 282 కోట్లు రావలసి ఉంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాలక మండళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
గ్రామీణ ప్రాంతాల్లో మ్యుటేషన్ ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజును ఖరారుచేసింది. ఫీజు కింద సదరు ఆస్తి విలువలో 0.1 శాతం లేదంటే రూ.800 (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం జీవో నంబర్–46 విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రమంతటా గ్రామ పంచాయతీల పరిధిలోని వ్యవసాయేతర స్థిరాస్తులపై హక్కుల బదిలీ కోసం ఒకేరకమైన ఫీజు వసూలు చేస్తారు. గతంలో గ్రామ పంచాయతీల తీర్మానం మేరకు ఆయా గ్రామాల్లో మ్యుటేషన్ ఫీజు నిర్ధారించే ఆనవాయితీ ఉంది. దీంతో మ్యుటేషన్ ఫీజు ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఉండేది. తాజా ఉత్తర్వులతో మ్యుటేషన్ ఫీజు ఖరారు అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదు. ధరణి ద్వారా గ్రామాల్లోనూ ఏకరూప రుసుము అమలవుతుంది. క్రయవిక్రయాలు, వారసత్వ హక్కుల బదిలీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల వంటి లావాదేవీలకు ఇది వర్తి స్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -
మ్యుటేషన్ చార్జీ ఎకరాకు రూ. 2,500
సాక్షి, హైదరాబాద్: భూ హక్కుల బద లాయింపు (మ్యుటేషన్)నకు ప్రత్యేక చార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగు భూముల హక్కుల బదిలీకి ఎకరాకు రూ. 2,500 చొప్పున వసూలు చేయనుంది. భూ విస్తీర్ణానికి అనుగుణంగా ఈ ఫీజును తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 29వ తేదీ నుంచి భూ హక్కులు, పట్టాదార్ పాస్పుస్త కాల చట్టం–2020 అమల్లోకి రావడంతో అం దుకు అనుగుణంగా ప్రభుత్వం చార్జీలను ప్రకటించింది. మ్యుటేషన్‌కు ఎకరాకు రూ.2,500 నిర్దేశించిన రెవెన్యూ శాఖ.. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ముద్రణతోపాటు కొరియర్ చార్జీల రూపేణా రూ. 300 వసూలు చేయనుంది. ఇన్నాళ్లూ మ్యుటేషన్‌కు నయా పైసా వసూలు చేయని ప్రభుత్వం తాజాగా చార్జీలను వడ్డించడంతో రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు చలానా సమయంలో కొత్త చార్జీలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సోమ వారం నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, ‘ధరణి’ని ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు. -
మ్యూటేషన్ ఫీజు 4 రెట్లు పెంపు
► ఆస్తుల మార్పిడిపై భారం ► గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఆమోదం వరంగల్ అర్బన్: ఆస్తుల కొనుగోలుదారులపై మ్యూటేషన్ ఫీజులను 4 రెట్లు పెంచి మునిసిపల్ కార్పొరేషన్ భారం మోపింది. ఫీజు పెంపుపై ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలు కొనుగోళ్లు, పేర్ల మార్పిడి నిత్యం జరుగుతునే ఉంటాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం పేరు మార్పిడి ప్రక్రియను గ్రేటర్లో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటించేలా ఇటీవల ప్రభుత్వం పలు నిబంధనలు సడలించింది. రిజిస్ట్రేషన్‌శాఖలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగితే ఆస్తి విలువలో 0.20 శాతం ఫీజులు వసూలు చేస్తున్నారు. రూ.లక్షకు 200 రూపాయల చొప్పన రిజిస్ట్రేషన్ శాఖలో చిల్లిస్తే అక్కడ నుంచి పేరు మార్పిడి కోసం గ్రేటర్‌కు బదాలాయిస్తున్నారు. కార్పొరేషన్ పన్నుల విభాగం సిబ్బంది దస్తావేజుల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పేరు మార్పిడి ప్రక్రియ చేపడుతుంటారు. ప్రస్తుతం ఆస్తుల పేరు మార్పిడి ఫీజును గ్రేటర్ పాలకవర్గం పెంచింది. 0.20శాతం నుంచి 1.0 శాతం ఫీజు పెంపునకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నిన్న, మొన్నటి వరకు రూ.లక్షకు రూ.200 చెల్లించాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి పేరు మార్పిడిపై రూ.లక్షకు వెయ్యి రూపాయల చొప్పన చెల్లించడం ప్రజలకు భారమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చాల సంవత్సరాలుగా మ్యూటేషన్ ఫీజు 1 శాతం వసూలు చేస్తున్నారని పాలకవర్గం చెబుతోంది.