► ఆస్తుల మార్పిడిపై భారం
► గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఆమోదం
వరంగల్ అర్బన్: ఆస్తుల కొనుగోలుదారులపై మ్యూటేషన్ ఫీజులను 4 రెట్లు పెంచి మునిసిపల్ కార్పొరేషన్ భారం మోపింది. ఫీజు పెంపుపై ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలు కొనుగోళ్లు, పేర్ల మార్పిడి నిత్యం జరుగుతునే ఉంటాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం పేరు మార్పిడి ప్రక్రియను గ్రేటర్‌లో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటించేలా ఇటీవల ప్రభుత్వం పలు నిబంధనలు సడలించింది. రిజిస్ట్రేషన్‌శాఖలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగితే ఆస్తి విలువలో 0.20 శాతం ఫీజులు వసూలు చేస్తున్నారు.
రూ.లక్షకు 200 రూపాయల చొప్పన రిజిస్ట్రేషన్ శాఖలో చిల్లిస్తే అక్కడ నుంచి పేరు మార్పిడి కోసం గ్రేటర్‌కు బదాలాయిస్తున్నారు. కార్పొరేషన్ పన్నుల విభాగం సిబ్బంది దస్తావేజుల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పేరు మార్పిడి ప్రక్రియ చేపడుతుంటారు. ప్రస్తుతం ఆస్తుల పేరు మార్పిడి ఫీజును గ్రేటర్ పాలకవర్గం పెంచింది. 0.20శాతం నుంచి 1.0 శాతం ఫీజు పెంపునకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నిన్న, మొన్నటి వరకు రూ.లక్షకు రూ.200 చెల్లించాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి పేరు మార్పిడిపై రూ.లక్షకు వెయ్యి రూపాయల చొప్పన చెల్లించడం ప్రజలకు భారమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చాల సంవత్సరాలుగా మ్యూటేషన్ ఫీజు 1 శాతం వసూలు చేస్తున్నారని పాలకవర్గం చెబుతోంది.
మ్యూటేషన్ ఫీజు 4 రెట్లు పెంపు
Published Wed, Jul 5 2017 9:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
Advertisement
Advertisement