సాక్షి, హైదరాబాద్: భూ హక్కుల బద లాయింపు (మ్యుటేషన్)నకు ప్రత్యేక చార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగు భూముల హక్కుల బదిలీకి ఎకరాకు రూ. 2,500 చొప్పున వసూలు చేయనుంది. భూ విస్తీర్ణానికి అనుగుణంగా ఈ ఫీజును తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 29వ తేదీ నుంచి భూ హక్కులు, పట్టాదార్ పాస్‌పుస్త కాల చట్టం–2020 అమల్లోకి రావడంతో అం దుకు అనుగుణంగా ప్రభుత్వం చార్జీలను ప్రకటించింది. మ్యుటేషన్‌కు ఎకరాకు రూ.2,500 నిర్దేశించిన రెవెన్యూ శాఖ.. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ముద్రణతోపాటు కొరియర్ చార్జీల రూపేణా రూ. 300 వసూలు చేయనుంది. ఇన్నాళ్లూ మ్యుటేషన్‌కు నయా పైసా వసూలు చేయని ప్రభుత్వం తాజాగా చార్జీలను వడ్డించడంతో రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు చలానా సమయంలో కొత్త చార్జీలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సోమ వారం నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, ‘ధరణి’ని ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment