న్యూఢిల్లీ: దేశంలో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ నాలుగో దశకు గడువు తేదీని 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌పై ఎంఎస్‌వో సంఘాలు, కొందరు వ్యక్తులు వేసిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం, సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. డిసెంబర్ 31కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటలైజేషన్ పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ కిందకు వచ్చే వారి ఇంకా డిజిటల్‌లోకి మారకపోతే వారికి జనవరి 31వరకు గడువిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీకానుంది.