⇒ రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరీక్షల నిర్వహణలో మొత్తం 700 మార్కుల ప్రాతిపదికన ఆ రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే 699.93 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 657.10 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది.
⇒ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రెండున్నర లక్షల తాగునీటి వనరులు ఉండగా, నీటిశుద్ధి పరీక్షల అనంతరం 25,546 తాగునీటి వనరుల్లో నీరు వివిధ కారణాలతో కలుషితమైనట్టు గుర్తించగా, ఆయా ప్రాంతాల్లొ అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.45 లక్షల ఇళ్లు ఉంటే, అందులో 70.04 లక్షల ఇళ్లకు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికే తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ అండ్ శానిటేషన్ 2023–24 ఆరి్థక సంవత్సరం వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేసింది.
దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీటిని వారి ఇంటి ఆవరణలోనే అందజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో కలిసి 2019 ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 60 శాతం గ్రామీణ ప్రాంత ఇళ్లలో తాగునీటి కుళాయిలు అందుబాటులోకి రాగా, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ఇళ్లలో 73.38 శాతం ఇళ్లకు 2024 మార్చి నెలాఖరుకే అందుబాటులోకి వచ్చాయని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment