బాన్సువాడ : గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి, ప్రజలకు ఫ్లోరైడ్ ర హిత మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం కోట్లా ది రూపాయలతో రక్షిత తాగునీటి పథకాలను నిర్మించిం ది. వీటి నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలను కేటాయిస్తోంది. కానీ, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మూ డు నెలల క్రితం జరిగిన జడ్‌పీ సమావేశంలో కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన విషయం విదితమే. కాంట్రాక్టర్ల తీరు కారణంగా ప్రజలు రో గాల బారిన పడుతున్నారనేది వాస్తవం. జిల్లావ్యాప్తంగా తాగునీటి నిర్వహణ పనులపై విమర్శలు వస్తున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో మొత్తం 18 ఫ్లోరైడ్ రహిత మంచినీటి సరఫరా పథకాలు ఉన్నాయి. ఒక్క బాన్సువాడ డివిజన్‌లోనే పది పథకాలు ఉండగా, నిజామాబాద్ డివిజన్‌లో ఎనిమిది ఉన్నాయి. బాన్సువాడ, దామరంచ, కోటగిరి, మందర్న, పైడిమల్, తగిలేపల్లి, బిచ్కుంద, నాగుల్‌గాం, బొల్లక్‌పల్లి, సోమార్‌పేట, యంచ, జాన్కంపేట, బాల్కొండ, చిన్నమావనంది, రామడుగు గ్రామాలలో వీటిని నిర్వహిస్తున్నారు. నిర్వహణ కోసం అధికారులు ఏటా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తుతున్న రాజకీ య పార్టీల నాయకులు సిండికేట్‌గా మారి, ఆ పనులను దక్కించుకొని, అధికారులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇష్టారీతిన మంచినీటి పథకాలను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఆటంకం కలుగుతుండగా, ప్రభుత్వ ఆదాయానికీ లక్షల రూపాయలలో గండి పడుతోంది. కలుషిత నీటిని సేవించి ప్ర జలు రోగాలబారిన పడుతున్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ బాన్సువాడ డివి జన్ పరిధిలో బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్నీ, మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, గాంధారి, బిచ్కుంద తదితర మండలాలు ఉన్నారుు. ఏటా ఆయా మండలాలలో పథకాల నిర్వహణకు నిధులు కేటాయించి, కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. గత పదేళ్ళుగా ఈ కాంట్రాక్ట్‌ల కోసం రాజకీయ నాయకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. పనులను కాంట్రాక్టర్లందరూ ఏకమై పర్సంటేజీల మాట్లాడుకొని, కార్యాలయంలోనే బేరసారాలు చేసుకొని టెండర్లు దక్కించుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఈసారి టెండర్లను నిర్వహించకుండా నేరుగానే పను లు కేటాయించారనే విమర్శలు వచ్చాయి.
పథకాల నిర్వహణ మాత్రం అధ్వానం
ప్రభుత్వం అంచనాలకు మించి నిధులు కేటాయిస్తోంది. నిర్వహణ పనులలో 50 శాతం కంటే అధికంగా మిగులుతున్నప్పటికీ, కాంట్రాక్టర్లు వీటిని సక్రమం గా నిర్వ హించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పనులు దక్కించుకొన్న వెం టనే వాటిని కిందిస్థాయి వర్కర్లకు అప్పగించి వారిని శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. కనీస అవగాహన లేకుండా నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్లు దెబ్బతిన్నా పట్టించుకోకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు అందుతోంది. క్లోరినేషన్ శాతంలో తేడాలతో వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. బాన్సువాడ సబ్‌డివిజన్‌లో ప్రతీ ఏడాది సుమారు వెయ్యి మందికి పైగా అతిసార, డయేరి యా బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. నీటి పైపులు పగిలిపోయినా, అందులో మురికినీరు చేరినా కాంట్రాక్టర్లు పట్టించుకోరు.
వీటిని పర్యవేక్షించాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సైతం పర్సంటేజీలు తీసుకొని, నిర్లక్ష్యంగా వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. బాన్సువాడ పట్టణంలో ఫిల్టర్ బెడ్ నిర్మించి 15 ఏళ్లు గడుస్తోంది. దీని నుంచి ఆయా ప్రాంతాలకు ఏర్పాటు చేసిన పైపులు పగిలిపోవడంతో లీకేజీలు అధికమయ్యాయి. ఇక్కడ నీటిని శుద్ధి చేసే ఇసుకను తొలగించి, కొత్త ఇసుకను నింపాల్సి ఉంది. అయినా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కలుషిత నీరు తాగడంతోనే ప్రజలు రోగాల భారిన పడుతున్నారని వైద్యులు పదేపదే పేర్కొంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.