supply system
-
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్‌లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్‌టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్‌లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
ఇంధన భద్రతలో ఆటో ఎల్పీజీ కీలకపాత్ర
న్యూఢిల్లీ: ఓవైపు అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా వ్యవస్థ సమస్యలు వెన్నాడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధన భద్రతను సాధించడంలో ఆటో ఎల్పీజీ కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమ సమాఖ్య ఐఏసీ తెలిపింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ తర్వాత రవాణా కోసం అత్యధికంగా ఉపయోగించే ఇంధనాల్లో ఆటో ఎల్పీజీ మూడో స్థానంలో ఉందని వివరించింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అవకాశాలు చాలా తక్కువని ఐఏసీ పేర్కొంది. కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటం, ఇంధన ఎగుమతిలో కీలకంగా ఉంటున్న ఒక దేశం పూర్తి స్థాయి యుద్ధంలో నిమగ్నమై ఉండటం తదితర అంశాల కారణంగా ఇంధన భద్రత సాధించడం మరింత కీలకంగా మారిందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ఆటో ఎల్పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలా కాకుండా వాటికి తగినంత గుర్తింపునివ్వకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా వ్యాఖ్యానించారు. విద్యుత్‌తో పోలిస్తే ఉత్పత్తి దశ నుంచి వినియోగం వరకూ ఎల్పీజీ వల్ల వచ్చే ఉద్గారాలు చాలా తక్కువని ఆయన చెప్పారు. -
ఇదేనా నిర్వహణ!
బాన్సువాడ : గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి, ప్రజలకు ఫ్లోరైడ్ ర హిత మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం కోట్లా ది రూపాయలతో రక్షిత తాగునీటి పథకాలను నిర్మించిం ది. వీటి నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలను కేటాయిస్తోంది. కానీ, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మూ డు నెలల క్రితం జరిగిన జడ్పీ సమావేశంలో కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన విషయం విదితమే. కాంట్రాక్టర్ల తీరు కారణంగా ప్రజలు రో గాల బారిన పడుతున్నారనేది వాస్తవం. జిల్లావ్యాప్తంగా తాగునీటి నిర్వహణ పనులపై విమర్శలు వస్తున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో మొత్తం 18 ఫ్లోరైడ్ రహిత మంచినీటి సరఫరా పథకాలు ఉన్నాయి. ఒక్క బాన్సువాడ డివిజన్‌లోనే పది పథకాలు ఉండగా, నిజామాబాద్ డివిజన్లో ఎనిమిది ఉన్నాయి. బాన్సువాడ, దామరంచ, కోటగిరి, మందర్న, పైడిమల్, తగిలేపల్లి, బిచ్కుంద, నాగుల్గాం, బొల్లక్‌పల్లి, సోమార్పేట, యంచ, జాన్కంపేట, బాల్కొండ, చిన్నమావనంది, రామడుగు గ్రామాలలో వీటిని నిర్వహిస్తున్నారు. నిర్వహణ కోసం అధికారులు ఏటా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తుతున్న రాజకీ య పార్టీల నాయకులు సిండికేట్‌గా మారి, ఆ పనులను దక్కించుకొని, అధికారులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇష్టారీతిన మంచినీటి పథకాలను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఆటంకం కలుగుతుండగా, ప్రభుత్వ ఆదాయానికీ లక్షల రూపాయలలో గండి పడుతోంది. కలుషిత నీటిని సేవించి ప్ర జలు రోగాలబారిన పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ బాన్సువాడ డివి జన్ పరిధిలో బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్నీ, మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, గాంధారి, బిచ్కుంద తదితర మండలాలు ఉన్నారుు. ఏటా ఆయా మండలాలలో పథకాల నిర్వహణకు నిధులు కేటాయించి, కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. గత పదేళ్ళుగా ఈ కాంట్రాక్ట్‌ల కోసం రాజకీయ నాయకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. పనులను కాంట్రాక్టర్లందరూ ఏకమై పర్సంటేజీల మాట్లాడుకొని, కార్యాలయంలోనే బేరసారాలు చేసుకొని టెండర్లు దక్కించుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఈసారి టెండర్లను నిర్వహించకుండా నేరుగానే పను లు కేటాయించారనే విమర్శలు వచ్చాయి. పథకాల నిర్వహణ మాత్రం అధ్వానం ప్రభుత్వం అంచనాలకు మించి నిధులు కేటాయిస్తోంది. నిర్వహణ పనులలో 50 శాతం కంటే అధికంగా మిగులుతున్నప్పటికీ, కాంట్రాక్టర్లు వీటిని సక్రమం గా నిర్వ హించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పనులు దక్కించుకొన్న వెం టనే వాటిని కిందిస్థాయి వర్కర్లకు అప్పగించి వారిని శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. కనీస అవగాహన లేకుండా నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. పైప్లైన్లు దెబ్బతిన్నా పట్టించుకోకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు అందుతోంది. క్లోరినేషన్ శాతంలో తేడాలతో వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. బాన్సువాడ సబ్‌డివిజన్‌లో ప్రతీ ఏడాది సుమారు వెయ్యి మందికి పైగా అతిసార, డయేరి యా బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. నీటి పైపులు పగిలిపోయినా, అందులో మురికినీరు చేరినా కాంట్రాక్టర్లు పట్టించుకోరు. వీటిని పర్యవేక్షించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం పర్సంటేజీలు తీసుకొని, నిర్లక్ష్యంగా వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. బాన్సువాడ పట్టణంలో ఫిల్టర్ బెడ్ నిర్మించి 15 ఏళ్లు గడుస్తోంది. దీని నుంచి ఆయా ప్రాంతాలకు ఏర్పాటు చేసిన పైపులు పగిలిపోవడంతో లీకేజీలు అధికమయ్యాయి. ఇక్కడ నీటిని శుద్ధి చేసే ఇసుకను తొలగించి, కొత్త ఇసుకను నింపాల్సి ఉంది. అయినా ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కలుషిత నీరు తాగడంతోనే ప్రజలు రోగాల భారిన పడుతున్నారని వైద్యులు పదేపదే పేర్కొంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.