బెంగళూరు: దేశం వ్యాప్తంగా కరోనా రోజువారీ కొత్త కేసుల నమోదు తగ్గుతోంది. వరసుగా రెండో రోజు దేశంలో రోజువారీ కేసులు 20 వేల కంటే దిగవకు నమోదు కావటం గమనార్హం. అయితే మరోవైపు కర్ణాటకలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. 60 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అందులో ఇద్దరికి మాత్రమే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు.
మరికొన్ని రోజు రాష్ట్రంలో ప్రాథమిక పాఠళాలలు ప్రారంభించాలనుకున్న ప్రభుత్వాని ఈ కేసులు ఆందోళనకరంగా మారాయి. బెంగుళూరు అర్బన్ జిల్లా కమిషనర్ జే. మంజునాథ్ దీనిపై స్పందిస్తూ.. 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా 60 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. వారంతా 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment