- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
Published Thu, Aug 25 2016 12:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
ఎస్‌ఎస్‌తాడ్వాయి : తాడ్వాయి మండ ల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్న త పాఠశాల విద్యార్థిని తాటి అఖిల (12) జ్వరంతో మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందింది. తాడ్వాయి మండ లం భూపతిపూర్‌కు చెందిన తాటి మల్లయ్య, సావిత్ర దంపతుల ఏకైక కుమార్తె అఖిల తాడ్వాయిలోని గిరి జన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా తండ్రి మల్లయ్య కుమార్తెను పాఠశాల నుంచి 16న ఇంటికి తీసుకెళ్లాడు. అఖిలకు జ్వరం రావడంతో తండ్రి మరుసటి రోజు వైద్య పరీక్షల కోసం ఏటూరునాగారంలోని ప్రైవేటు ఆస్రతికి తీసు కెళ్లారు.
మెరుగైన వైద్యం కోసం ఎంజీ ఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల మంగళవారం రాత్రి మృతి చెందింది. మలేరియాతో మృతి చెందిందని వైద్యులు చెప్పారని అఖిల తండ్రి తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక తమ కూరుతు మృతి చెందిందని మల్లయ్య ఆరోపించాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమార్తెకు ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించ లేదన్నారు.
Advertisement
Advertisement