నీట్ శిక్షణ దరఖాస్తుకు 30 ఆఖరు తేదీ | the last date of application is NEAT training on 30th | Sakshi
Sakshi News home page

నీట్ శిక్షణ దరఖాస్తుకు 30 ఆఖరు తేదీ

Published Tue, Jul 26 2016 7:45 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

the last date of application is NEAT training on 30th

ఎస్సీ విద్యార్థులకు దీర్ఘకాలిక ఉచిత ఎంబీబీఎస్ ప్రవేశపరీక్షకు(నీట్) శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ శిక్షణ పొందేందుకు విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మంగళవారం (26వ తేదీ)తో ముగిసిన తుది గడువును 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశం కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో గౌలిదొడ్డిలోని రెసిడెన్షియల్ స్కూలులో ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌నివ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement