నీట్ శిక్షణ దరఖాస్తుకు 30 ఆఖరు తేదీ
ఎస్సీ విద్యార్థులకు దీర్ఘకాలిక ఉచిత ఎంబీబీఎస్ ప్రవేశపరీక్షకు(నీట్) శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ శిక్షణ పొందేందుకు విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మంగళవారం (26వ తేదీ)తో ముగిసిన తుది గడువును 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశం కోసం విద్యార్థులు ఆన్లైన్లో తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో గౌలిదొడ్డిలోని రెసిడెన్షియల్ స్కూలులో ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్నివ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.