నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఎన్‌పీకే ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది.
సాక్షి, న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఎన్‌పీకే ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఓసీపీ(మొరాకో), ప్రభుత్వ రంగ కో-ఆపరేటివ్ ఎరువుల సంస్థ క్రిబ్కో సంయుక్త భాగస్వామ్యంతో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి మన్సుక్ ఎల్ మాండవ్య సమక్షంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.
2019 ఏప్రిల్ నాటికి పరిశ్రమను ఏర్పాటు చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని క్రిబ్కో ఎండీ ఎన్.సాంబశివరావు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చిందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.