అనంతపురం సెంట్రల్ : అనంతపురం తపోవనం సమీపంలోని సీడబ్యూహెచ్‌సీ గోదాముపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇఫ్‌కో కంపెనీకి చెందిన 20–2–0–13 రకం ఎరువులు గడువు మీరిన వాటిని కొత్త సంచుల్లోకి మార్పిడి చేసి విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 564 బస్తాలు సీజ్ చేయగా, వాటి విలువ సుమారు రూ. 5.62 లక్షలు ఉంటుందని అంచనా.
రైతులను మోసగించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఎరువులను పాత సంచుల నుంచి కొత్త సంచుల్లోకి మార్పు చేస్తున్నట్లు తేలిందన్నారు. సదరు ఎరువులను శాంపిల్ తీసి అగ్రికల్చర్ ల్యాబ్‌కు పంపనున్నట్లు వెల్లడించారు. తదుపరి చర్య నిమిత్తం డిటెన్షన్ నోటీసు జారీ చేశామని చెప్పారు. తనిఖీలో విజిలెన్స్ సీఐ రెడ్డప్ప, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉమాపతి, స్థానిక ఏఓ వాసుప్రకాశ్ పాల్గొన్నారు.
రూ.5.62 లక్షలు విలువైన ఎరువుల బస్తాలు సీజ్
Published Wed, May 3 2017 12:14 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement
Advertisement