ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
Published Thu, Aug 4 2016 12:51 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
నంద్యాల రూరల్:
నంద్యాల పట్టణంలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కర్నూలు డీడీఏ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో మార్కాపురం ఏడీఏ సుదర్శన్‌రాజు, చిత్తూరు జిల్లా ఏఓ అజయ్‌కుమార్, నంద్యాల ఏడీఏ సుధాకర్, ఏఓ ఆయూబ్‌బాషాల ఆధ్వర్యంలో బుధవారం దాడులునిర్వహించారు. నూనెపల్లెలోని హర్షిత, సాయిసుదర్శన్, నూకల సుదర్శన్, ఆర్‌కే వెంకటసాయి, డీఎంఆర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేయగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.45 లక్షల విలువైన ఎరువులు, పురుగు మందులను గుర్తించారు. వాటిని విక్రయించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశామని డీడీఏ ప్రభాకర్‌రావు తెలిపారు. తగ్గిన ధరలకు ఎరువులను విక్రయించకుండా పాత ధరలకే కొందరు అమ్మడాన్ని ఆయన ఆక్షేపించారు. తక్షణమే గోదాముల్లోని పాత స్టాక్‌కు రికార్డులు చూపాలని, ఎరువుల దుకాణాల యజమానులను ఆదేశించారు. ప్రతినెల క్రయవిక్రయాల సమాచారాన్ని ఏఓ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. అనుమతిలేని ఎరువులు, పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement