అనుమతులతోనే విక్రయాలు చేయాలి
హిందూపురం రూరల్ : రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తదితర వాటిని విక్రయం చేసే దుకాణదారులు అనుమతులు తీసుకుని వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం హిందూపురంలోని బృందావనం ట్రేడర్స్, నందినీ హైబ్రిడ్ సీడ్స్ ఏజెన్సీ, రైతు మిత్ర తదితర దుకాణాల్లో ఆయన తనిఖీలు చేశారు. దుకాణదారుల యజమానులతో ప్రిన్సిపల్ సర్టిఫికెట్, సోర్స్ సర్టిఫికెట్ తదితర అనుమతులు తీసుకున్న తర్వాత విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేపట్టాలన్నారు.
రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో వ్యాట్, ట్రేడింగ్ నెంబర్, పరిమితి మించి పోయే కాలం తదితర వాటిని తప్పనిసరిగా బిల్లులో నమోదు చేయాలని ఆదేశించారు. రూ.11,18,375 విలువ చేసే విత్తనాలు, రూ. 6 లక్షల విలువ చేసే పురుగుల మందు, రూ.27,88 716 ఎరువులను దుకాణంలో విక్రయించకుండా తాత్కాలికంగా అనుమతులు రద్దు చేశారు. వీటì అమ్మకాలు చేపట్టాలంటే ప్రిన్సిపల్ ధ్రువ పత్రాలు తీసుకుని చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి రామారావు, స్థానిక ఏఓ శ్రీలత తదితరులు ఉన్నారు.