పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఏలూరు(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బేబీ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏలూరు మండలం వట్లూరుకు చెందిన బేబీ.. తన భర్త వేధిస్తున్నాడంటూ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో ఏలూరు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ జరుగుతుండగా బాత్‌రుమ్‌లోకి వెళ్లి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో బేబీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.