చెరువులు తవ్వితే చేనంతా వెలుగే | Ponds dug unity | Sakshi
Sakshi News home page

చెరువులు తవ్వితే చేనంతా వెలుగే

Published Wed, Nov 26 2014 2:20 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

చెరువులు తవ్వితే చేనంతా వెలుగే - Sakshi

చెరువులు తవ్వితే చేనంతా వెలుగే

ఎకరానికి 40 ట్రాక్టర్‌లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు.
 
పుష్కర కాలం సాగిన పోరాటం తరువాత ఏర్ప డిన తెలంగాణ రాష్ట్ర సాగు, తాగు నీటి అవస రాలను తీర్చడానికి ప్రభు త్వం దృష్టి కేంద్రీకరిం చింది. 3.6 కోట్ల తెలం గాణ ప్రజల ఆహార, వ్యవ సాయ అవసరాలను తీర్చడానికి  సమస్త శక్తులు కేంద్రీకరించి రాష్ట్రంలో చెరువుల మీద సర్వే చేయిం చింది. 45,300 చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు ఉన్నట్టు లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలోని చెరువుల, కుంటల పూడిక తీత, దాని వినియోగం అంశం మీద పరిశోధన చేయడానికి మిచిగన్ విశ్వ విద్యాలయం (అమెరికా) ముగ్గురు విద్యార్థులు,   ఫ్రీడమ్ సంస్థ ఈ ఆగస్ట్‌లో నల్లగొండ జిల్లాలోని 33 గ్రామాలను సందర్శించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి.

చెరువులలో పూడిక తీసిన గ్రామాలకు చెందిన 700 మంది రైతులను వారు కలుసుకున్నారు. స్థాని కులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పంట ఉత్పత్తి పెరుగుదల, భూగర్భ నీటిమట్టం పెరుగుదల, రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నట్టు విద్యార్థులు గమనించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల పరిశోధన సంస్థ పూడిక మట్టిని పరిశోధించింది. రాష్ట్ర వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల మంత్రు లకు, ఇతర అధికారులకు కూడా ఈ పరిశోధనల గురించి విద్యార్థులు తెలియజేశారు.

1,500 కిలోల తలసరి కర్బన ఉద్గారాలతో, ప్రపంచ సగటుకు భారతదేశం దిగువనే ఉన్నం దున, చెరువుల పూడిక ద్వారా రసాయనిక ఎరు వులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు. అలాగే భూగర్భ జలమట్టాన్ని పెంచి, బోర్ బావులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ విని యోగాన్ని  తగ్గించుకునే అవకాశం కూడా ఉంది.  కాబట్టి  పూడికతీత ఖర్చులో సుమారు 30 శాతానికి పైగా కార్బన్స్ క్రెడిట్స్ రూపేణా పారిశ్రామిక దేశాల నుంచి తిరిగి రాబట్టుకోవచ్చని మిచిగాన్ విద్యా ర్థులు  నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. సుస్థిర అభివృద్ధికి ఈ పూడిక తీత ప్రాజెక్టు చరిత్రలో ఒక గొప్ప నమూనాగా నిలిచిపో గలదని కూడా వారు వివరించారు. దహగామ ఆదిత్య (స్టూడెంట్ గవర్నమెంట్ అధ్యక్షుడు), జాన్ మానెట్, లియాన్ ఎన్‌పెరా బృందం పూడిక తీతతో కలిగే ప్రయోజనాలను వర్గీకరించి చెప్పారు. అందులో ముఖ్యమైనవి-

ఎకరానికి 40 ట్రాక్టర్‌లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అధికోత్పత్తితో ప్రతి ఎకరా సాగు భూమికి అదనం గా 60 మానవ పనిదినాలను పెంచవచ్చు. తక్కు వైన స్థూల, మధ్య సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా సాగు భూమికి అందజేసి ఎరువులు, పురుగు మం దుల వినియోగంలో 80 శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు.

తెలంగాణలోని 10 జిల్లాల్లోని 45,300 చెరువు లలో ఉన్న పూడిక మట్టిని తొలగించినట్లయితే అదనపు భూసేకరణ ఖర్చులు, చట్టపరమైన పేచీలు, జాప్యాలు లేకుండానే మూడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సమానమైన నీటిని అదనంగా పొం దవచ్చు. ఉపరితల అదనపు నీటి పారుదల అవకాశాన్ని, ఇప్పుడున్న దానికి రెండింతలకు పెం చవచ్చు. అదనపు భూగర్భ జల మొత్తాన్ని పెం చవచ్చు. మునుగోడు మండలంలోని మెల్మకన్నె గ్రామంలో మూడు సంవత్సరాలలో తీసిన 50 వేల ట్రాక్టర్ల పూడిక మట్టిని 1,200 ఎకరాల సాగు భూమిలో వేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయల అదనపు ఫలసాయాన్ని వారు పొందారు. పర్యవసానంగా 140 అడుగుల తోతున ఉన్న భూగర్భ జలాలు 30 అడుగుల పైకి ఉబికి వచ్చాయి. విద్యుత్ వినియోగం మీద ఒత్తిడిని బాగా తగ్గింది. రెండవ పంట గగనమై ఊహించడానికి అవకాశం లేని పరిస్థితులలో పంటలకు సమృద్ధిగా సాగు నీరు లభించింది.

 ప్రతి క్యూబిక్ మీటర్ చెరువు మట్టికి సమా నంగా సృష్టించిన అదనపు వెయ్యి లీటర్ల నీటి పరి మాణానికి అనుగుణంగా కనీసం ఒక కేజీ నుంచి గరిష్టంగా 2 కేజీల వరకు చేపల ఉత్పత్తిని సాధిం చవచ్చని జాతీయ చేపల పెంపకం అభివృద్ధి సంస్థ తెలియజేస్తుంది.
 దహగామ ఆదిత్య బృందం చేసిన విశ్లేషణలో ఒకే ఒక్కసారి యంత్రాలతో, ట్రాక్టర్లతో పూడిక తీసిన అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం సాలీనా సగటున ఇవ్వగలిగిన 42 పని దినాలకంటే రెట్టింపుగా 100 శాతం గ్రామీణ ఉపాధి అవకాశాలు మానవ పనిదినాలు పెరిగినట్లు, అదే పెట్టుబడి మొత్తానికి సమకూరినట్లుగాను వెల్లడైంది. 100 రోజుల ఉపాధి హామీ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఒక్కరికి 10 వేల రూపాయలు. లభ్యమైన దేశీయ సగటు పని దినాలు ఒకరికి 42 మాత్రమే. తర్వాత ఉపాధి హామీ అవసరం లేకుండానే అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎరువుల, పురు గు మందుల వాడకంలో ఆదాను భూగర్భ నీటి మట్టంలో పెరుగుదలను, విద్యుత్ వినియోగంలో తగ్గింపును, ఫ్లోరోసిన్ నివారణను ఏకకాలంలో సాధించగలదు. నిర్లక్ష్యానికి గురైన రైతుల  ఆత్మ హత్యలను నివారించి, విలువైన రైతుల ప్రాణాలను కాపాడగలదు.
 
(వ్యాసకర్త తెలంగాణ జలసాధన  సమితి నాయకుడు)   నైనాల గోవర్ధన్

 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement