Ninala Govardhan
-
ఆదివాసీల ప్రాణరక్షణే ‘బంగారు తెలంగాణ’
సందర్భం ఆదివాసులకు టీఆర్ ఎస్ పార్టీ చేసిన ‘హెలికాప్టర్ అంబులెన్స్’ వాగ్దానం ఎటు పోయిందో కానీ, గూడేల్లో అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అవుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసాగుతోంది. అత్యంత వెనుకబడ్డ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ -గిరిజ నుల దారిద్య్రాన్ని నిర్మూలించే లక్ష్యంతో అనేక సామాజిక ఆర్థిక ప్రణాళికలను ప్రభుత్వా లు 68 ఏళ్లుగా అమలు చేస్తు న్నాయి. అయినా ఆదివాసీ - గిరిజనుల జీవితాల్లో ఏవిధమై న మార్పులేదు. ఆఫ్రికాలో అత్యంత వెనుకబడ్డ దేశాల ప్రజల కంటే, ఆదిలాబాద్ ఆదివాసీలు మరింత దుస్థితి లో ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. నిజమైన స్వేచ్ఛకొరకు రాంజీగోండ్ పోరాటం, కొమురంభీమ్ నాయకత్వంలో ఆదివాసీల సామూహిక పోరాటం, ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజన పోరాటం తర్వాత కూడా ఆదివాసుల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. చెలిమల్లో వాగుల్లో నీళ్లుతాగుతూ, పోష కాహారం కరువై శరీరంలో రక్తం లోపించి, చిన్నారులు, బాలింతలు మలే రియా, విష జ్వరాలతో ఏటా వందల మంది మర ణిస్తూ, జీవన్మరణ పోరాటం నేటికీ సాగిస్తూనే ఉన్నారు. గొంతెండితే గుక్కెడు నీళ్ల కోసం 68ఏళ్ల అనంతరం 6కిలోమీటర్లకుపైగా తాగు నీటి కుండలతో నడుస్తున్నా రంటే అభివృద్ధి అందమేమిటో అర్థం అవుతుంది. ఇటీవలి ప్రణాళికా సంఘం సభ్యుల నిశిత సర్వే నివేదిక ఆదివాసీ గిరిజనుల దుస్థితికి అద్దంపడుతోంది. ఆరున్నర దశాబ్దాల ప్రణాళికల అనంతరం కూడా దేశం లో అసమానత్వం, అభివృద్ధి పక్క పక్కనే కొనసాగి తిష్టవేసిన వైనాన్ని యువప్రణాళికా సంఘ ఆర్థికశాస్త్ర నిపుణులు ఆర్థిక రాజకీయ వారపత్రిక(ఈ.పీ.డబ్ల్యూ) జనవరి -2015 సంచికలో విశ్లేషించారు. దేశంలోని 640 జిల్లాలు, 5955 ఉప జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో అభివృద్ధి అనేది సహజంగానే ఒకే రకంగాలేదు. ఈ విశ్లేషణలో అభివృద్ధి అంశంలో జిల్లాల మధ్య అవధుల్లేని అంతరాలను ఎత్తిచూపుతూనే, ఒకే జిల్లాలోని ఉప జిల్లాలు/ రెవెన్యూ డివిజన్ల మధ్య తర గని అంతరాలున్నాయని పేర్కొన్నారు. 27 జిల్లాల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న 10 శాతం రెవెన్యూ డివిజన్లు, వాటి సరసన అభివృద్ధిలో అట్టడుగున ఉన్న 10 శాతం రెవెన్యూ సబ్డివిజన్లలో దారుణ దుస్థితిలో ప్రజలు మగ్గుతున్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన గ్రామాలు, ప్రజలు దారుణ దుస్థితిలో బతు కులీడుస్తు న్నారని ఆ నివేదిక సారాంశం. దేశంలోనే తొలి వరుసన ఉన్న 166 జిల్లాల్లో ఉచ్ఛస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్ డివిజన్లు, అధమస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్డివిజన్లు కలగలిసి ఉన్నాయి. ఈ అధ్యయనంలో ముఖ్యాంశం ఏమిటంటే : ఏ జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు అభివృద్ధిలో అట్టడుగున ఉన్నాయో, ఆయా జిల్లాల్లో గిరిజనులు ఆదివాసుల జనాభా అత్యధికంగా ఉంది. ఈ డివిజన్లలోని అపార మైన సహజ వనరుల ఆధారంగా వెలసిన పరిశ్రమలు ఒక జిల్లాలోని ఒక సబ్ డివిజన్లో అపారమైన సంప దను సృష్టిస్తే అదే జిల్లాలోని మిగతా ప్రాంతాలు, వాటి లో ఉన్న గిరిజనుల జనాభా కటిక దారిద్య్రంలో మగ్గి పోతోంది. నిండు యవ్వనంలోనే అనారోగ్య మరణాల తో వీరి జనాభా తగ్గుతోంది. ప్రముఖంగా గిరిజనులు అధికంగా ఉన్న అనేక రెవెన్యూ డివిజన్లు అపారమైన ఖనిజసంపదతో మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్న ప్పటికీ, వీటి ఫలితమైన ఆర్థికోత్పత్తి సంపదల భాగ స్వామ్యం నుంచి ఆ గిరిజన ఆదివాసీ ప్రాంత ప్రజలను బలవంతంగా కట్టుబట్టలతో బయటకు గెంటివేసేలా నేటి అభివృద్ధి విధానం సాగుతోంది. ఆ వనరులపై అన్నివిధాల ఆధిపత్యం నెరిపే కొద్ది ప్రాంతపు పట్టణా నికే అభివృద్ధి పరిమితమైంది. ఈ జిల్లాలో ఉన్న అత్యధి క శాతం గిరిజనులు ఆదివాసీలు కడు పేదరికంలో మగ్గుతుంటే, పట్టణాల్లో సంపద పోగు కావడం కాకతాళీ యం కాదని ఆ నివేదిక తెలిపింది. పెట్టుబడిదారీ విధానం దానికనుగుణమెన అభివృ ద్ధిని దారుణ అసమానత్వాన్ని ప్రజల దుస్థితులను పక్క పక్కనే నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో నయం చేయగల సాధారణ మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరేచ నాలు, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బులతో వంద లాది ఆదివాసులు మరణిస్తే అందులో ఒక్కరి ప్రాణాలు కాపాడడానికి వీసమంత ప్రయత్నమైనా వివక్ష లేకుం డా నేటికీ ఎందుకు జరగడంలేదు? 68 ఏళ్ల స్వాతంత్య్రం ఈనాటికీ ఆదివాసీలకు రోడ్లు రహదారులను, గుక్కెడు నీటిని ఎందుకందించటం లేదు? ఎక్కడ తప్పనిసరిగా వైద్య వసతులు కల్పించాలో అక్కడే అవి నేటికీ ఎందుకు కల్పించలేదు? ఆదివాసుల ఆయువులను కాపాడుతా మని టీఆర్ ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన హెలికాప్టర్ అంబులెన్స్ వాగ్దానం ఎక్కడికెళ్లింది? హెలికాప్టర్ అం బులెన్స్ ఎటుపోయిందో కానీ, ఆదివాసీ గూడేల్లో ఎడ్ల బండ్లు నడవకపోతే, అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అయి ఈనాటికీ కొనసాగుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసా గుతోంది. 2008-09లో మూడువేల మంది ఆదివా సీలు- గిరిజనులు పోషకాహార లోపంతో రోగ నిరోధక శక్తి తగ్గి, తీవ్ర అనారోగ్యంతో మరణించారు. నాటి నుం డి ప్రతి ఏటా 200-500 మంది చనిపోతూనే ఉన్నారు. వెనుకబాటుతనాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఉట్నూ ర్, బోథ్ ఆదివాసీ ప్రాంతాలకు త్వరలో వస్తోన్న ప్రపం చ బ్యాంకు బృందం ఈ అంశాన్ని తీవ్రంగా ఆలోచిం చాలి. ఎన్ని ప్రణాళికలు వేసినా దారిద్య్ర నిర్మూలన మాట అటుంచి, దాని నీడను కూడా చెరపని ప్రణాళిక లకు పడ్డ పందికొక్కుల గురించి మథనం చేయాలిప్పు డు. ఆదివాసీ గిరిజన దారిద్య్ర సమూల నిర్మూలనే నేటి విధానం కావాలి. (ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాల ను ప్రపంచబ్యాంక్ సందర్శించనున్న సందర్భంగా) వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నేత మొబైల్ 97013 81799 -
చెరువులు తవ్వితే చేనంతా వెలుగే
ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. పుష్కర కాలం సాగిన పోరా టం తరువాత ఏర్ప డిన తెలం గాణ రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడానికి ప్రభు త్వం దృష్టి కేంద్రీకరించింది. 3.6 కోట్ల తెలంగాణ ప్రజల ఆహార, వ్యవసాయ అవసరా లను తీర్చడానికి సమస్త శక్తులు కేంద్రీకరించి రాష్ట్రంలో చెరువుల మీద సర్వే చేయిం చింది. 45,300 చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు ఉన్నట్టు లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలోని చెరు వుల, కుంటల పూడికతీత, దాని వినియోగం అం శం మీద పరిశోధన చేయడానికి మిచిగన్ విశ్వ విద్యాలయం (అమెరికా) ముగ్గురు విద్యార్థులు, ఫ్రీడమ్ సంస్థ ఈ ఆగస్ట్‌లో నల్లగొండ జిల్లాలోని 33 గ్రామాలను సందర్శించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి. చెరువులలో పూడిక తీసిన గ్రామాలకు చెందిన 700 మంది రైతులను వారు కలుసుకున్నారు. స్థాని కులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పంట ఉత్పత్తి పెరుగుదల, భూగర్భ నీటిమట్టం పెరుగుదల, రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నట్టు విద్యార్థులు గమనించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల పరిశోధన సంస్థ పూడిక మట్టిని పరిశోధించింది. రాష్ట్ర వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల మంత్రు లకు, ఇతర అధికారులకు కూడా ఈ పరిశోధనల గురించి విద్యార్థులు తెలియజేశారు. 1,500 కిలోల తలసరి కర్బన ఉద్గారాలతో, ప్రపంచ సగటుకు భారతదేశం దిగువనే ఉన్నం దున, చెరువుల పూడిక ద్వారా రసాయనిక ఎరు వులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు. అలాగే భూగర్భ జలమట్టాన్ని పెంచి, బోర్ బావులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ విని యోగాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూడికతీత ఖర్చులో సుమారు 30 శాతానికి పైగా కార్బన్స్ క్రెడిట్స్ రూపేణా పారిశ్రామిక దేశాల నుంచి తిరిగి రాబట్టుకోవచ్చని మిచిగాన్ విద్యా ర్థులు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. దహగామ ఆదిత్య (స్టూడెంట్ గవర్న మెంట్ అధ్యక్షుడు), జాన్ మానెట్, లియాన్ ఎన్ పెరా బృందం పూడిక తీతతో కలిగే ప్రయోజనాలను వర్గీకరించి చెప్పారు. అం దులో ముఖ్యమైనవి- ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అధికోత్పత్తితో ప్రతి ఎకరా సాగు భూమికి అదనం గా 60 మానవ పనిదినాలను పెంచవచ్చు. తక్కు వైన స్థూల, మధ్య సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా సాగు భూమికి అందజేసి ఎరువులు, పురుగు మం దుల వినియోగంలో 80 శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. తెలంగాణలోని 10 జిల్లాల్లోని 45,300 చెరువు లలో ఉన్న పూడిక మట్టిని తొలగించినట్లయితే అదనపు భూసేకరణ ఖర్చులు, చట్టపరమైన పేచీలు, జాప్యాలు లేకుండానే మూడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సమానమైన నీటిని అదనంగా పొం దవచ్చు. ఉపరితల అదనపు నీటి పారుదల అవకాశాన్ని, ఇప్పుడున్న దానికి రెండింతలకు పెం చవచ్చు. అదనపు భూగర్భ జల మొత్తాన్ని పెం చవచ్చు. మునుగోడు మండలంలోని మెల్మకన్నె గ్రామంలో మూడు సంవత్సరాలలో తీసిన 50 వేల ట్రాక్టర్ల పూడిక మట్టిని 1,200 ఎకరాల సాగు భూమిలో వేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయల అదనపు ఫలసాయాన్ని వారు పొందారు. పర్యవసానంగా 140 అడుగుల తోతున ఉన్న భూగర్భ జలాలు 30 అడుగుల పైకి ఉబికి వచ్చాయి. విద్యుత్ వినియోగం మీద ఒత్తిడిని బాగా తగ్గింది. రెండవ పంట గగనమై ఊహించడానికి అవకాశం లేని పరిస్థితులలో పంటలకు సమృద్ధిగా సాగు నీరు లభించింది. దహగామ ఆదిత్య బృందం చేసిన విశ్లేషణలో ఒకే ఒక్కసారి యంత్రాలతో, ట్రాక్టర్లతో పూడిక తీసిన అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం సాలీనా సగటున ఇవ్వగలిగిన 42 పని దినాలకంటే రెట్టింపుగా 100 శాతం గ్రామీణ ఉపాధి అవకాశాలు మానవ పనిదినాలు పెరిగినట్లు, అదే పెట్టుబడి మొత్తానికి సమకూరినట్లుగాను వెల్లడైంది. 100 రోజుల ఉపాధిహామీ పథకానికి కేటాయించిన బడ్జె ట్ ఒక్కరికి 10 వేల రూపాయలు. లభ్యమైన దేశీయ సగటు పనిదినాలు ఒకరికి 42 మాత్రమే. తర్వాత ఉపాధి హామీ అవసరం లేకుండానే అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎరువుల, పురుగు మం దుల వాడకంలో ఆదాను భూగర్భ నీటి మట్టంలో పెరుగుదలను, విద్యుత్ వినియోగంలో తగ్గింపును, ఫ్లోరోసిన్ నివారణను ఏకకాలంలో సాధించగలదు. నిర్లక్ష్యానికి గురైన రైతుల ఆత్మ హత్యలను నివారిం చి, విలువైన రైతుల ప్రాణాలను కాపాడగలదు. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకుడు) -
చెరువులు తవ్వితే చేనంతా వెలుగే
ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. పుష్కర కాలం సాగిన పోరాటం తరువాత ఏర్ప డిన తెలంగాణ రాష్ట్ర సాగు, తాగు నీటి అవస రాలను తీర్చడానికి ప్రభు త్వం దృష్టి కేంద్రీకరిం చింది. 3.6 కోట్ల తెలం గాణ ప్రజల ఆహార, వ్యవ సాయ అవసరాలను తీర్చడానికి సమస్త శక్తులు కేంద్రీకరించి రాష్ట్రంలో చెరువుల మీద సర్వే చేయిం చింది. 45,300 చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు ఉన్నట్టు లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలోని చెరువుల, కుంటల పూడిక తీత, దాని వినియోగం అంశం మీద పరిశోధన చేయడానికి మిచిగన్ విశ్వ విద్యాలయం (అమెరికా) ముగ్గురు విద్యార్థులు, ఫ్రీడమ్ సంస్థ ఈ ఆగస్ట్‌లో నల్లగొండ జిల్లాలోని 33 గ్రామాలను సందర్శించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి. చెరువులలో పూడిక తీసిన గ్రామాలకు చెందిన 700 మంది రైతులను వారు కలుసుకున్నారు. స్థాని కులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పంట ఉత్పత్తి పెరుగుదల, భూగర్భ నీటిమట్టం పెరుగుదల, రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నట్టు విద్యార్థులు గమనించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల పరిశోధన సంస్థ పూడిక మట్టిని పరిశోధించింది. రాష్ట్ర వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల మంత్రు లకు, ఇతర అధికారులకు కూడా ఈ పరిశోధనల గురించి విద్యార్థులు తెలియజేశారు. 1,500 కిలోల తలసరి కర్బన ఉద్గారాలతో, ప్రపంచ సగటుకు భారతదేశం దిగువనే ఉన్నం దున, చెరువుల పూడిక ద్వారా రసాయనిక ఎరు వులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు. అలాగే భూగర్భ జలమట్టాన్ని పెంచి, బోర్ బావులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ విని యోగాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూడికతీత ఖర్చులో సుమారు 30 శాతానికి పైగా కార్బన్స్ క్రెడిట్స్ రూపేణా పారిశ్రామిక దేశాల నుంచి తిరిగి రాబట్టుకోవచ్చని మిచిగాన్ విద్యా ర్థులు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. సుస్థిర అభివృద్ధికి ఈ పూడిక తీత ప్రాజెక్టు చరిత్రలో ఒక గొప్ప నమూనాగా నిలిచిపో గలదని కూడా వారు వివరించారు. దహగామ ఆదిత్య (స్టూడెంట్ గవర్నమెంట్ అధ్యక్షుడు), జాన్ మానెట్, లియాన్ ఎన్పెరా బృందం పూడిక తీతతో కలిగే ప్రయోజనాలను వర్గీకరించి చెప్పారు. అందులో ముఖ్యమైనవి- ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అధికోత్పత్తితో ప్రతి ఎకరా సాగు భూమికి అదనం గా 60 మానవ పనిదినాలను పెంచవచ్చు. తక్కు వైన స్థూల, మధ్య సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా సాగు భూమికి అందజేసి ఎరువులు, పురుగు మం దుల వినియోగంలో 80 శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. తెలంగాణలోని 10 జిల్లాల్లోని 45,300 చెరువు లలో ఉన్న పూడిక మట్టిని తొలగించినట్లయితే అదనపు భూసేకరణ ఖర్చులు, చట్టపరమైన పేచీలు, జాప్యాలు లేకుండానే మూడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సమానమైన నీటిని అదనంగా పొం దవచ్చు. ఉపరితల అదనపు నీటి పారుదల అవకాశాన్ని, ఇప్పుడున్న దానికి రెండింతలకు పెం చవచ్చు. అదనపు భూగర్భ జల మొత్తాన్ని పెం చవచ్చు. మునుగోడు మండలంలోని మెల్మకన్నె గ్రామంలో మూడు సంవత్సరాలలో తీసిన 50 వేల ట్రాక్టర్ల పూడిక మట్టిని 1,200 ఎకరాల సాగు భూమిలో వేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయల అదనపు ఫలసాయాన్ని వారు పొందారు. పర్యవసానంగా 140 అడుగుల తోతున ఉన్న భూగర్భ జలాలు 30 అడుగుల పైకి ఉబికి వచ్చాయి. విద్యుత్ వినియోగం మీద ఒత్తిడిని బాగా తగ్గింది. రెండవ పంట గగనమై ఊహించడానికి అవకాశం లేని పరిస్థితులలో పంటలకు సమృద్ధిగా సాగు నీరు లభించింది. ప్రతి క్యూబిక్ మీటర్ చెరువు మట్టికి సమా నంగా సృష్టించిన అదనపు వెయ్యి లీటర్ల నీటి పరి మాణానికి అనుగుణంగా కనీసం ఒక కేజీ నుంచి గరిష్టంగా 2 కేజీల వరకు చేపల ఉత్పత్తిని సాధిం చవచ్చని జాతీయ చేపల పెంపకం అభివృద్ధి సంస్థ తెలియజేస్తుంది. దహగామ ఆదిత్య బృందం చేసిన విశ్లేషణలో ఒకే ఒక్కసారి యంత్రాలతో, ట్రాక్టర్లతో పూడిక తీసిన అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం సాలీనా సగటున ఇవ్వగలిగిన 42 పని దినాలకంటే రెట్టింపుగా 100 శాతం గ్రామీణ ఉపాధి అవకాశాలు మానవ పనిదినాలు పెరిగినట్లు, అదే పెట్టుబడి మొత్తానికి సమకూరినట్లుగాను వెల్లడైంది. 100 రోజుల ఉపాధి హామీ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఒక్కరికి 10 వేల రూపాయలు. లభ్యమైన దేశీయ సగటు పని దినాలు ఒకరికి 42 మాత్రమే. తర్వాత ఉపాధి హామీ అవసరం లేకుండానే అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎరువుల, పురు గు మందుల వాడకంలో ఆదాను భూగర్భ నీటి మట్టంలో పెరుగుదలను, విద్యుత్ వినియోగంలో తగ్గింపును, ఫ్లోరోసిన్ నివారణను ఏకకాలంలో సాధించగలదు. నిర్లక్ష్యానికి గురైన రైతుల ఆత్మ హత్యలను నివారించి, విలువైన రైతుల ప్రాణాలను కాపాడగలదు. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకుడు) నైనాల గోవర్ధన్ -
విద్యుత్ మణిహారాలా? మృత్యుపాశాలా?
పాత ప్రభుత్వాల బాటలోనే ప్రకృతి వినాశకరమైన అవే ఇంధన, అభివృద్ధి నమూనాలతో బంగారు తెలంగాణ అసాధ్యం. ప్రపంచమంతా ‘‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’’ అంటుండగా కాలుష్య కాల సర్పాల్లాంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన అనాలోచితం. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి తప్ప మానవాళికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ‘‘అనంత శక్తి వనరులున్నా యనే ప్రాతిపదికపై అంతులేని వృద్ధితో అందరికీ న్యాయం జరుగుతుందనే ఊహతో మనమీ ప్రపంచాన్ని నిర్మించు కున్నాం. వాస్తవంలోనూ, కలలోనూ కూడా అది ఇక లేదు. మనం మరో భిన్న ప్రపంచాన్ని నిర్మించు కోవాల్సిందే. ఇంత పెద్ద మానవ సమాజాన్ని భరి స్తున్న ప్రపంచం ఇక మిగలదు.’’ -రాబర్ట్ జెన్సన్. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 135 ఏళ్ల క్రితం, 1885లో ప్రపంచ ఉష్ణోగ్రతలను నమోదు చేయడం ప్రారంభమైనప్పటి నుండి ఇదే అత్యధిక స్థాయి. కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగి భూతాపం పెరుగుతుండటం వల్ల కలుగుతున్న విపరిణామాల్లో ఇది ఒకటి. ఇటీవల అత్యంత ఉపద్రవకరంగా కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదలు, వేలాది మందిని బలిగొన్న ఉత్తరాంచల్ పెను ఉత్పాతం, తాజాగా ఉత్తరాంధ్ర, విశాఖ నగరాలను ధ్వంసించిన హుద్ హుద్ రక్క సులే కాదు, ఫిలిప్పీన్స్‌లో విలయం సృష్టించిన హైయాన్ ఉప్పెన సైతం వాతావరణ మార్పుల ఫలితాలే. రుతువులు గతులు తప్పుతుండగా అకాల వర్షాలు, వరదలు, దుర్భిక్ష క్షామ పరిస్థితులు సర్వసాధారణం అయ్యాయి. అందుకే తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు తాండవ మాడుతోంది. అన్నదాతల ఆత్మహత్యలు ఆగకుండా సాగుతున్నాయి. ఈ నేపథ్యం నుండి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించడం కోసం గోదావరికి ఇరువేపులా ‘‘విద్యుత్ మణిహారాల’’ లా బొగ్గు ఆధారిత భారీ థర్మల్ కేంద్రాలను నిర్మిం చాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించడం అవసరం. రాష్ట్రం ఇప్పుడున్న, ప్రతి పాదిస్తున్న ఎత్తిపోతల సాగునీటి పథకాలకు సంబంధించి 8 వేల మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. అన్ని రకాల సాగునీటి అవసరాలను కలుపుకుంటే అది 12 వేల మెగా వాట్లు. ఒక్క ప్రాణహిత ఎత్తిపోతల పథకానికే 3,466 మెగావాట్లు అవసరం. దానికి జాతీయ హోదా లభిస్తే తప్ప ప్రభుత్వానికి అది గుదిబండ కాక తప్పదు. దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొ నడానికి ప్రపంచ మంతా వినాశకరమైనదిగా ఎంచి, విడనాడుతున్న మార్గాన్ని ఎంచుకుంటోంది. వాతావరణ మార్పుల ఉత్పాతానికి ప్రధాన కారణం బొగ్గు వినియోగం పెరిగిపోవడమే. అమెరి కాలో పర్యావరణ, ప్రజా ఉద్యమాల కారణంగా వందల బొగ్గు విద్యుత్ ప్లాంట్లు మూతపడి, థర్మల్ విద్యుదుత్పత్తి 39 శాతానికి తగ్గింది. 2016 నాటికి మరో 175 ప్లాంట్లు మూతపడనున్నాయి. ప్రపంచం లోనే అతి పెద్ద బొగ్గు వినియోగదారైన చైనా సైతం ఏటా 655 మిలియన్ టన్నుల బొగ్గు వాడకాన్ని తగ్గించుకుంటోంది. కాలుష్య కారక బొగ్గు వినియో గం దిశగా ఇక ఒక్క అడుగైనా ముందుకు సాగ రాదని వాతావార ణ మార్పుల విజ్ఞానం శాసిస్తోంది. పారిశ్రామిక విప్లవం తదుపరి కర్బన ఉద్గారాల వల్ల సగటున భూమి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగిందని అంచనా. ఇందులో మూడింట రెండు వంతులు 1980 నుండి పెరిగినదే. ఇదే రీతిలో శిలాజ ఇంధనాలను (బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు) ఖర్చు చేస్తుంటే... ఈ శతాబ్దాంతానికి భూతాపం 2.6 నుండి 4.8 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరి మరల్చరాని పెను వాతావరణ మార్పులకు, ఉత్పా తాలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చ రిస్తున్నారు. భూతాపాన్ని 2 డిగ్రీల గరిష్ట స్థాయికి కుదించకపోతే మానవాళిసహా జీవావరణ వ్యవస్థ మనుగడకు ముప్పని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఐరోపా దేశాలన్నీ ప్రత్యామ్నాయ, శాశ్వత ఇంధన వనరులైన సౌర, పవన, జల విద్యు దుత్పత్తికి మళ్లుతున్నాయి. సగటున 30 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలుండే జర్మనీ 30 శాతం ఇంధన అవస రాల కోసం సౌర విద్యుత్తుపై ఆధారపడుతోంది. మన దేశంలో ఏడాదికి 280 రోజులకు పైగా 35 నుండి 45 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోద వుతాయి. అలాంటి మనకు సౌర విద్యుత్తు ఎందు కూ పనికిరాకుండా పోతోంది? సువిశాల ప్రాంతా ల్లో సాగుభూములను, గ్రామాలను రుద్ర భూము లుగా మారుస్తూ, బొగ్గు గనులను తోడేసి ముందు తరాలకు హానిని తలపెట్టడం సమంజసమేనా? పాత ప్రభుత్వాల బాటలోనే ప్రకృతి వినాశకరమైన అదే అభివృద్ధి, ఇంధన నమూనాలతో బంగారు తెలం గాణను నిర్మించడం అసాధ్యం. ప్రపంచమం తా ‘‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’’అంటుండగా కాలుష్య కాల సర్పాల్లాంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన అనాలోచితం, అనుచితం. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని సౌర, పవన, జలశక్తుల వంటి ప్రత్యా మ్నాయ, శాశ్వత ఇంధన వనరుల అభివృద్ధి బాట పట్టాలి. రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లన్నిటినీ సోలార్ పంపు సెట్లుగా మార్చే కృషికి ప్రాధాన్యం ఇవ్వాలి. జర్మనీ, చైనా, అమెరికా, బంగ్లాదేశ్‌లు సరే, గుజరాత్‌ను చూసైనా ప్రతి ఇంటి కప్పుపైనా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి, గ్రిడ్‌కు అనుసం ధానిస్తే గృహ అవసరాలతో పాటూ ఇతర అవస రాలకు సైతం విద్యుత్తు లభిస్తుంది. పర్యావరణ, జీవావరణ అనుకూల విద్యుదుత్పత్తి, అభివృద్ధి తప్ప మానవాళి ముందు నేడు వేరే ప్రత్యామ్నా యం లేదు. ఆ సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. (వ్యాసకర్త తెలంగాణ జల సాధన సమితి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు)