ఆదివాసీల ప్రాణరక్షణే ‘బంగారు తెలంగాణ’ | Tribal Life protection is 'Golden Telangana' | Sakshi
Sakshi News home page

ఆదివాసీల ప్రాణరక్షణే ‘బంగారు తెలంగాణ’

Published Mon, Apr 20 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

నైనాల గోవర్ధన్

నైనాల గోవర్ధన్

 సందర్భం
 
 ఆదివాసులకు టీఆర్ ఎస్ పార్టీ చేసిన ‘హెలికాప్టర్ అంబులెన్స్’ వాగ్దానం ఎటు పోయిందో కానీ, గూడేల్లో అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అవుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసాగుతోంది.
 
 అత్యంత వెనుకబడ్డ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ -గిరిజ నుల దారిద్య్రాన్ని నిర్మూలించే లక్ష్యంతో అనేక సామాజిక ఆర్థిక ప్రణాళికలను ప్రభుత్వా లు 68 ఏళ్లుగా అమలు చేస్తు న్నాయి. అయినా ఆదివాసీ - గిరిజనుల జీవితాల్లో ఏవిధమై న మార్పులేదు. ఆఫ్రికాలో అత్యంత వెనుకబడ్డ దేశాల ప్రజల కంటే, ఆదిలాబాద్ ఆదివాసీలు మరింత దుస్థితి లో ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. నిజమైన స్వేచ్ఛకొరకు రాంజీగోండ్ పోరాటం, కొమురంభీమ్ నాయకత్వంలో ఆదివాసీల సామూహిక పోరాటం, ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజన పోరాటం తర్వాత కూడా ఆదివాసుల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. చెలిమల్లో వాగుల్లో నీళ్లుతాగుతూ, పోష కాహారం కరువై శరీరంలో రక్తం లోపించి, చిన్నారులు, బాలింతలు మలే రియా, విష జ్వరాలతో ఏటా వందల మంది మర ణిస్తూ, జీవన్మరణ పోరాటం నేటికీ సాగిస్తూనే ఉన్నారు. గొంతెండితే గుక్కెడు నీళ్ల కోసం 68ఏళ్ల అనంతరం 6కిలోమీటర్లకుపైగా తాగు నీటి కుండలతో నడుస్తున్నా రంటే అభివృద్ధి అందమేమిటో అర్థం అవుతుంది.

 ఇటీవలి ప్రణాళికా సంఘం సభ్యుల నిశిత సర్వే నివేదిక ఆదివాసీ గిరిజనుల దుస్థితికి అద్దంపడుతోంది. ఆరున్నర దశాబ్దాల ప్రణాళికల అనంతరం కూడా దేశం లో అసమానత్వం, అభివృద్ధి పక్క పక్కనే కొనసాగి తిష్టవేసిన వైనాన్ని యువప్రణాళికా సంఘ ఆర్థికశాస్త్ర నిపుణులు ఆర్థిక రాజకీయ వారపత్రిక(ఈ.పీ.డబ్ల్యూ) జనవరి -2015 సంచికలో విశ్లేషించారు.

 దేశంలోని 640 జిల్లాలు, 5955 ఉప జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లలో అభివృద్ధి అనేది సహజంగానే ఒకే రకంగాలేదు. ఈ విశ్లేషణలో అభివృద్ధి అంశంలో జిల్లాల మధ్య అవధుల్లేని అంతరాలను ఎత్తిచూపుతూనే, ఒకే జిల్లాలోని ఉప జిల్లాలు/ రెవెన్యూ డివిజన్‌ల మధ్య తర గని అంతరాలున్నాయని పేర్కొన్నారు. 27 జిల్లాల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న 10 శాతం రెవెన్యూ డివిజన్లు, వాటి సరసన అభివృద్ధిలో అట్టడుగున ఉన్న 10 శాతం రెవెన్యూ సబ్‌డివిజన్‌లలో దారుణ దుస్థితిలో ప్రజలు మగ్గుతున్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన గ్రామాలు, ప్రజలు దారుణ దుస్థితిలో బతు కులీడుస్తు న్నారని ఆ నివేదిక సారాంశం. దేశంలోనే తొలి వరుసన ఉన్న 166 జిల్లాల్లో ఉచ్ఛస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్ డివిజన్లు, అధమస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్‌డివిజన్‌లు కలగలిసి ఉన్నాయి.

 ఈ అధ్యయనంలో  ముఖ్యాంశం ఏమిటంటే : ఏ జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు అభివృద్ధిలో అట్టడుగున ఉన్నాయో, ఆయా జిల్లాల్లో గిరిజనులు ఆదివాసుల జనాభా అత్యధికంగా ఉంది. ఈ డివిజన్లలోని అపార మైన సహజ వనరుల ఆధారంగా వెలసిన పరిశ్రమలు ఒక జిల్లాలోని ఒక సబ్ డివిజన్‌లో అపారమైన సంప దను సృష్టిస్తే అదే జిల్లాలోని మిగతా ప్రాంతాలు, వాటి లో ఉన్న గిరిజనుల జనాభా కటిక దారిద్య్రంలో మగ్గి పోతోంది. నిండు యవ్వనంలోనే అనారోగ్య మరణాల తో వీరి జనాభా తగ్గుతోంది. ప్రముఖంగా గిరిజనులు అధికంగా ఉన్న అనేక రెవెన్యూ డివిజన్లు అపారమైన ఖనిజసంపదతో మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్న ప్పటికీ, వీటి ఫలితమైన ఆర్థికోత్పత్తి సంపదల భాగ స్వామ్యం నుంచి ఆ గిరిజన ఆదివాసీ ప్రాంత ప్రజలను బలవంతంగా కట్టుబట్టలతో బయటకు గెంటివేసేలా నేటి అభివృద్ధి విధానం సాగుతోంది. ఆ వనరులపై అన్నివిధాల ఆధిపత్యం నెరిపే కొద్ది ప్రాంతపు పట్టణా నికే అభివృద్ధి పరిమితమైంది. ఈ జిల్లాలో ఉన్న అత్యధి క శాతం గిరిజనులు ఆదివాసీలు కడు పేదరికంలో మగ్గుతుంటే, పట్టణాల్లో సంపద పోగు కావడం కాకతాళీ యం కాదని ఆ నివేదిక తెలిపింది.

 పెట్టుబడిదారీ విధానం దానికనుగుణమెన అభివృ ద్ధిని దారుణ అసమానత్వాన్ని ప్రజల దుస్థితులను పక్క పక్కనే నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో నయం చేయగల సాధారణ మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరేచ నాలు, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బులతో వంద లాది ఆదివాసులు మరణిస్తే అందులో ఒక్కరి ప్రాణాలు కాపాడడానికి వీసమంత  ప్రయత్నమైనా వివక్ష లేకుం డా నేటికీ ఎందుకు జరగడంలేదు? 68 ఏళ్ల స్వాతంత్య్రం ఈనాటికీ ఆదివాసీలకు రోడ్లు రహదారులను, గుక్కెడు నీటిని ఎందుకందించటం లేదు? ఎక్కడ తప్పనిసరిగా వైద్య వసతులు కల్పించాలో అక్కడే అవి నేటికీ ఎందుకు కల్పించలేదు? ఆదివాసుల ఆయువులను కాపాడుతా మని టీఆర్ ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన  హెలికాప్టర్ అంబులెన్స్ వాగ్దానం ఎక్కడికెళ్లింది? హెలికాప్టర్ అం బులెన్స్ ఎటుపోయిందో కానీ, ఆదివాసీ గూడేల్లో ఎడ్ల బండ్లు నడవకపోతే, అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అయి ఈనాటికీ కొనసాగుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసా గుతోంది. 2008-09లో మూడువేల మంది ఆదివా సీలు- గిరిజనులు పోషకాహార లోపంతో రోగ నిరోధక శక్తి తగ్గి, తీవ్ర అనారోగ్యంతో మరణించారు. నాటి నుం డి ప్రతి ఏటా 200-500 మంది చనిపోతూనే ఉన్నారు.

 వెనుకబాటుతనాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఉట్నూ ర్, బోథ్ ఆదివాసీ ప్రాంతాలకు త్వరలో వస్తోన్న ప్రపం చ బ్యాంకు బృందం ఈ అంశాన్ని తీవ్రంగా ఆలోచిం చాలి. ఎన్ని ప్రణాళికలు వేసినా దారిద్య్ర నిర్మూలన మాట అటుంచి, దాని నీడను కూడా చెరపని ప్రణాళిక లకు పడ్డ పందికొక్కుల గురించి మథనం చేయాలిప్పు డు. ఆదివాసీ గిరిజన దారిద్య్ర సమూల నిర్మూలనే నేటి విధానం కావాలి.    

     (ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాల ను ప్రపంచబ్యాంక్ సందర్శించనున్న సందర్భంగా)
     వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నేత
     మొబైల్ 97013 81799

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement