తల్లీకొడుకులు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ సంఘటన కొత్తపేట పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో సోమవారం జరిగింది.
ఇంద్రకీలాద్రి(విజయవాడ): తల్లీకొడుకులు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ సంఘటన కొత్తపేట పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో సోమవారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన మండా ప్రకాశ్(24), తల్లి గోవిందమ్మ(48)లు ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో.. స్థానికులు వెళ్లి చూడగా.. ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు.
పురుగుల మందు తాగి మృతిచెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ప్రకాశ్ భార్యకు నొప్పులు రావడంతో రెండు రోజుల కిందటే ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం రాత్రి తల్లితో పాటు ఆస్పత్రికి వెళ్లి భార్యను చూసి వచ్చిన అనంతరం ఇద్దరు విగత జీవులుగా మారారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.