కన్నారెడ్డి కేసు: సర్కారు సీరియస్
లంచం ఇవ్వబోనని చెప్పడమే కాక లంచగొండి అధికారిని ఏసీబీకి పట్టించాలని అనుకున్నందుకు పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కన్నారెడ్డి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కన్నారెడ్డిని చితకబాదిన కేసులో మోమన్‌పేట ఎస్ఐ రాజు, ఏఎస్ఐ వీరాస్వామితో పాటు హెడ్ కానిస్టేబుళ్లు వెంకటయ్య, శంకరయ్య, కానిస్టేబుళ్లు శివయ్య, రాఘవేందర్‌లను హెడ్ క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు.
ఫెర్టిలైజర్ షాపు అనుమతి కోసం వ్యవసాయాధికారి నీరజను కన్నారెడ్డి కలిశారు. అయితే అందుకు అతడి నుంచి నీరజ రూ. 20వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఎందుకివ్వాలని అడిగినందుకు కన్నారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా నీరజ ఫిర్యాదుతో ఎస్ఐ రాజు, సిబ్బంది కలిసి కన్నారెడ్డిని చితకబాదారు. రాజు దాడితో కన్నారెడ్డి రెండు కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో అతడు హైదారబాద్ ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.