ఉద్యోగులను ఐరన్ రాడ్తో బెదిరించి..
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ వర్క్స్(జేఎస్డబ్ల్యూ) ఓ పరిపాలన అధికారిని సస్పెండ్ చేసింది. ఆ సంస్థలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులపై ఆయన ఐరన్ రాడ్డుతో దాడి చేయడంతోపాటు అసభ్యకరపదజాలంతో తిట్టడంతో అతడిని సస్పెండ్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. దీంతో సంస్థ ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కింది స్థాయి ఉద్యోగుల విషయంలో అంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మందలిస్తూ అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.