
ఎరువుల గోదాముపై తూ.కో దాడులు
అనంతపురం సెంట్రల్ : రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలోని అవంతి ఎరువుల గోదాముపై తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. జైకిసాన్ కంపెనీ చెందిన 20–20–0–13, 20–0–13 రకాల ఎరువులు బస్తాల్లో భారీగా తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి బస్తాలో ఐదు కిలోలు తక్కువ ఉన్నట్లు తనిఖీలో తేలిందని సీఐ వివరించారు.
అలాగే ఎమ్మార్పీ, తయారీదారుడి చిరునామా తదితర వివరాలు ఏవీ లేకుండా విక్రయిస్తున్నారన్నారు. వీటన్నింటినీ సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే అనంతపురం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో చౌకడిపోలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ముగ్గురు డిపో డీలర్లపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.