దేశవ్యాప్తంగా అందుబాటులోఉన్న సంప్రదాయ ఇంధన వనరుల్ని సాధ్యమైనంత మేర వినియోగంలోకి తేవడంతోపాటు గతంలో మూసివేతకు గురైన ఎరువుర కర్మాగారాల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విశాఖపట్నం, మంగుళూరు, కుద్దూర్ నగరాల్లో వ్యూహాత్మక ముడి చమురు (క్రూడ్ ఆయిల్) నిల్వల కోసం రూ. 4,948 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఒకప్పుడు దేదీప్య మానంగా వెలుగొంది, తర్వాతి కాలంలో మూతపడిన ఎరువుల కర్మాగారాలు రెండింటిని పునరుద్ధరించాని కేంద్రం నిర్ణయించింది. వాటిలో ఒకటి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ కర్మాగారం కాగా, మరోటి బీహార్లోని బరౌనీలోని ప్లాంట్. ఇవి రెండూ హిందుస్థాన్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్కు చెందినవి.
ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకు కేంద్రం ఓకే
Published Tue, Mar 31 2015 9:33 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement