చేవెళ్ల మండలం మడికట్టు గ్రామంలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి(చేవెళ్ల): చేవెళ్ల మండలం మడికట్టు గ్రామంలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బల్వంత్ రెడ్డి(29) అనే రైతు పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన కోసం వెతకటం ప్రారంభించారు.
ఆదివారం పొలంలో విగతజీవుడై పడి ఉండటం గమనించిన పక్కపొలం వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పక్కనే పురుగుల మందు డబ్బా ఉంది. పంట ఎండిపోవటం, అప్పులు తీర్చే మార్గం తోచకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.