ధారూరు(రంగారెడ్డి): సాగు భారం కాగా.. అప్పులు తీర్చే దారి కానరాక మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు యాదయ్య(30) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, కూరగాయలు సాగు చేశాడు. పత్తి ఆశించిన దిగుబడి రాలేదు. బోర్లు వేయటానికి, పంటల సాగుకు బ్యాంకు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చిన అప్పులు రూ.3 లక్షల వరకు మిగిలాయి.
ఈ క్రమంలోనే భార్య నర్సమ్మ ఈనెల 10న గొడవ పడి, బంధువుల ఇంట్లో జరిగే విందులో పాల్గొనేందుకు ఇద్దరు కొడుకులు మల్లేశ్(5), మణికంఠ(3)లతో కలిసి తాండూర్ వెళ్లింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన యాదయ్య పురుగుల మందు తాగి పడుకున్నాడు. అర్థ్దరాత్రి సమయంలో తల్లి అతడిని నిద్ర లేపేందుకు యత్నించగా ఎంతకూ లేవలేదు. అప్పటికే మృతి చెందిన యాదయ్యను చూసి కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది.
అప్పులెలా తీర్చాలనే బెంగతో..
Published Sat, Mar 12 2016 8:23 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement