620 టన్నుల ఎరువులు సీజ్
Published Sun, Aug 7 2016 12:32 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
గీసుకొండ : నగరంలోని మూడో డివిజన్ ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని ఎత్తుగడ్డ వద్దనున్న అవంతి వేర్ హౌజింగ్ సర్వీసెస్‌కు చెందిన గోదాముల్లో మండల వ్యవసాయ శాఖ ఏఓ శ్రీనివాస్ శనివారం తనిఖీలు చేశారు.
ఈసందర్భంగా గోదాముల్లో 2011 సంవత్సరం నుంచి కొరమాండల్ కంపెనీకి చెందిన గోదావరి పాస్‌గోల్డ్ ఎరువు 569 టన్నులు, గోదావరి రాక్‌గోల్డ్ ఎరువు 51 టన్నులు నిల్వ చేసినట్లు గుర్తించారు. ఇంతకాలంగా విక్రయించకుండా నిల్వ చేయడంతో, దాన్ని పొలాల్లో చల్లినా ప్రభావవంతంగా పనిచేయదు. దీంతో మొత్తం పాత స్టాక్‌ను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువుల విలువ రూ.46.56 లక్షలు ఉంటుంది. శాంపిల్స్‌ను సేకరించి, హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. ఎరువుల నాణ్యత తేలే వరకు వాటిని మార్కెట్‌లో విక్రయించొద్దని సూచించారు. తనిఖీల్లో ఏఈఓలు స్రవంతి, కల్యాణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement