ఎరువు మరింత బరువు!
యూరియాకు జీఎస్టీ దెబ్బ
► టన్నుకు రూ.300–400 వరకు పెరగనున్న ధర
► 50 కిలోల డీఏపీపై రూ.100–125 వరకు పెరిగే అవకాశం
► ఎరువులపై 12 శాతం జీఎస్టీని నిర్ణయించిన కౌన్సిల్
► రాష్ట్రంలో వచ్చే సీజన్‌లో 13.5 లక్షల బస్తాల యూరియా, 2.5 లక్షల బస్తాల డీఏపీ వినియోగం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం కోసం తీసుకువస్తున్న ‘వస్తుసేవల పన్ను (జీఎస్టీ)’తో రైతులపై మాత్రం భారం పడనుంది. ఎరువులపై ప్రస్తుతం 4 నుంచి 8 శాతం మధ్య పన్నులు ఉండగా.. జీఎస్టీలో ఎరువులపై 12 శాతం పన్ను విధించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఎరువులు, సూక్ష్మ పోషకాల విక్రయ ధరలు అనివార్యంగా పెరగనున్నాయి. దీనివల్ల సాగు వ్యయం పెరుగుతుందని, ఎరువుల వినియోగంలో సమతుల్యత దెబ్బతింటుందని ఎరువుల కంపెనీలు వాదిస్తున్నాయి.
రూ.100 వరకు పెరగనున్న యూరియా
జీఎస్టీలో 12 శాతం పన్ను విధించడంతో.. దేశంలోనే అత్యధికంగా వినియోగమయ్యే యూరియా ధర టన్నుకు ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగే అవకాశముంది. డై అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) వంటి ఎరువుల ధరలు కొన్ని రాష్ట్రాల్లో టన్నుకు రూ.3 వేల వరకు పెరగనున్నాయి.
పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎరువులు, సూక్ష్మ పోషకాలపై ఎటువంటి పన్నులూ లేవు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో నామమాత్రపు పన్నులు న్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎరువుల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశముంది. ఇక రోడ్డు రవాణాపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల కూడా ఎరువుల చిల్లర ధరలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఎరువుల రవాణాపై ఎటువంటి సర్వీసుట్యాక్స్ లేకపోవడం గమనార్హం.
వందల కోట్ల భారం..
జీఎస్టీ విధింపుతో ఏయే రకం ఎరువు ధర ఎంతమేర పెరగనుందనే లెక్కలు వేస్తున్నారు. అంతేగాకుండా పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేక రైతులపైనే భారం వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తే మాత్రం ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. అయితే యూరియా ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తోంది.
ప్రస్తుతం టన్ను యూరియా ధర రూ.5,630గా ఉంది. ఇది మినహా మిగతా ఎరువులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ఆయా కంపెనీలే ఉత్పత్తి వ్యయం ఆధారంగా ధరలు నిర్ణయించుకుంటాయి. కాగా రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ కోసం 8 లక్షల టన్నులు, యాసంగి కోసం 5.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీంతో పన్ను కారణంగా ధరలు పెరిగితే.. భారం ఎవరిపై పడుతుందనేది ప్రాధాన్యంగా మారింది.
డీఏపీ కూడా భారమే..
50కిలోల డీఏపీ బస్తా చిల్లర ధర రూ.100–125 వరకు పెరిగే అవకాశ ముం ది. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.వెయ్యి వరకు ఉండగా.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను తో కలిపి రూ.1,125 అవుతుందని మార్కె ట్‌వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభు త్వం అత్యధిక సబ్సిడీ ఇస్తున్న యూరియా కు డీఏపీ సహా మిగతా ఎరువులకు మధ్య ధరలో తేడా బాగా పెరిగే అవకాశ ముంది.
దీంతో రైతులు యూరియానే ఎక్కువగా వినియోగించడంపై దృష్టి పెడతారని ఎరువుల కంపెనీలు అంటున్నాయి. దానివల్ల సూక్ష్మ పోషకాలు అందక పంటల దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొం టున్నాయి. కాగా రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్‌కు 2.5 లక్షల బస్తాల డీఏపీని సరఫరా చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.