- ఎరువులు, విత్తన దుకాణాలు, సహకార కేంద్రాల్లో స్వైపింగ్ మిషన్లు
- 15 రోజుల్లోగా సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రైతులను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆ శాఖ నూతన కమిషనర్ జగన్‌మోహన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎరువులు, విత్తన డీలర్లు, దుకాణదారులు 15 రోజుల్లోగా స్వైపింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రైతుల వద్ద ఉండే డెబిట్ కార్డుల ద్వారానే ఆర్థిక లావా దేవీలు జరపాలని.. తద్వారా వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని.. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధి కారుల(డీఏవో)ను ఆదేశించారు.
ఇక స్వైపింగ్ మిషన్ల సరఫరాకు అవసరమైన సాంకేతిక సహకారం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ)కి లేఖ రాశా రు. రైతులను, వ్యవసాయాధికారులను నగదు రహిత లావాదేవీల వైపు నడిపించేందుకు జగన్‌మోహన్ జిల్లాల్లో పర్యటిం చనున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రాథమిక సహకార సంఘాలు(ప్యాక్స్), డీసీసీబీల్లోనూ స్వైపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచా లని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞపి చేసింది. వ్యవసాయశాఖ నిర్ణయంతో వేలాది స్వైపిం గ్ మిషన్లకు గిరాకీ ఏర్పడింది. ఎరువులు, విత్తన డీలర్లు, ప్యాక్స్‌లు కొత్తగా మిషన్లను కొనుగోలు చేయాలి. 15 రోజుల్లోగా స్వైపిం గ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోకపోతే వ్యవసాయశాఖ అధికారులు డీలర్లపై చర్య లు తీసుకునే అవకాశం ఉంది.
వ్యవసాయంలో క్యాష్‌లెస్‌కు శ్రీకారం
Published Thu, Dec 8 2016 1:12 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement