సౌరశక్తితో ఎరువులు
వాషింగ్టన్: సౌరశక్తితో ఎరువులను తయారు చేసే వినూత్న పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా సూర్య కాంతిని వాడుకుని నైట్రోజన్ అణువును అమ్మోనియాగా మార్పు చేస్తారు. అమ్మోనియాను ఎరువుల్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం ఈ రసాయన పద్ధతి పూర్తిగా వినియోగంలోకి వస్తే.. రైతులు శిలాజ ఇంధనాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ నేషనల్ రెన్యూవబుల్ లేబొరేటరీ(ఎన్‌ఆర్‌ఈఎల్), కొలరాడో బౌల్డర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని రూపొదించారు. ఇప్పటికే అమ్మోనియాను జీవ సంబంధిత పద్ధతిలో, హేబర్ పద్ధతిలోనూ తయారు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం సూర్యకాంతితో వినియోగించుకుని నైట్రోజన్‌లో అణువులోని రెండు పరమాణువులను విడగొట్టి అమ్మోనియాను తయారు చేయడం సులభం, చౌకయిన పద్ధతని చెబుతున్నారు.