విజయనగరం: తోటపల్లి సీఎం సభలో దుర్గారావు అనే వ్యక్తి గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దుర్గరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఎం. రాజాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.