ఓ మాజీ ఎమ్మెల్యే వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది.
అనంతపురం(కల్యాణదుర్గం): ఓ మాజీ ఎమ్మెల్యే వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. పురుగుల మందు తెచ్చుకుని రాజు(30) అనే వ్యక్తి పోలీసుల ముందే తాగాడు. హుటాహుటిన కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాస్తవాలు వెల్లండించడానికి బాధితుడు భయపడుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.