వింజమూరు(నెల్లూరు): పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు నడిరోడ్డుపై మృతిచెందాడు. రోడ్డు మీద పడి కొట్టకుంటున్నా స్థానికులు ఎవరూ స్పందించకపోవడంతో.. అక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు బంగ్లాసెంటర్‌లో బుధవారం జరిగింది.
వివరాలు.. కొండాపురం మండలం గొట్టికొండాల గ్రామానికి చెందిన మౌలాలి(28) తాపి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు బంగ్లా సెంటర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య
Published Wed, Oct 28 2015 6:16 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement
Advertisement