'రేషన్ డీలర్ల సమస్యలపై పోరాటం' | Ration dealers fighting issues | Sakshi
Sakshi News home page

'రేషన్ డీలర్ల సమస్యలపై పోరాటం'

Published Sat, Mar 7 2015 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

Ration dealers fighting issues

హైదరాబాద్: రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీ కేంద్రంగా పోరాడతామని చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు వెల్లడించారు. ఈ నెల 17న 10వేల మంది రేషన్ డీలర్లతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీలర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రికి విన్నవించామని, తమ డిమాండ్లను పరిష్కరించేందుకు వారు చొరవ చూపాలని కోరారు. రేషన్ డీలర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కారుణ్య నియామకాలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. డీలర్లందరికీ రూ.10 లక్షల గ్రూప్ బీమా అమలు చేయాలని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement