డీలర్లపై వేటు
Published Sat, Nov 19 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
దేవనకొండ: ఈ–పాసును బైపాస్ చేసి నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతికి పాల్పడిన రేషన్‌డీలర్లపై అధికారులు చేపట్టారు. దేవనకొండలోని 17, 18, 30కు చెందిన ముగ్గురు డీలర్లపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఆర్‌ఐ ఆదిమల్లన్నబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీ
నందవరం : మండలంలోని 7గురు డీలర్లపై వేటుపడింది. నందవరంలో 3వ షాపు లచ్చప్ప, గంగవరంలో 8వ షాపు సత్యనారాయణశెట్టి, నాగలదిన్నెలో 12వ షాపు తిప్పన్న, 13వ షాపు షబ్బీర్, 33వ షాపు ప్రేమ్‌కుమార్, టి.సోమలగూడూరులో 17వ షాపు మాదన్న, కె.పేటలో 21వ షాపు ఈరన్న అనే డీలర్లు వేటు చేసినట్లు తహసీల్దార్ హుశేన్‌సాహెబ్ తెలిపారు. ఈ నెలలో ఆయా డీలర్లు ద్వార డీడీ కట్టించుకోవడం లేదని, కొత్త డీలర్లు వచ్చే వరకు ఇన్‌చార్జ్‌ల ద్వార డీడీలు కట్టించి కార్డుదారులకు సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
ఎమ్మిగనూరు రూరల్:
మండలంలో 15 మంది డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మండలంలో ఇద్దరు, పట్టణంలో 13 మంది డీలర్లపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటూ వారి నుంచి రికవరీకి చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement