నల్లగొండ : రేషన్ దుకాణాల్లో బియ్యం మిగులు నిల్వలపై లెక్కతేలింది. డీలర్లు మిగులు నిల్వలపై సరైన సమాచారం ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయగా మిగిలిన నిల్వలపై పారదర్శకంగా సమచారం ఇవ్వకుండా డీలర్లు బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించడం సర్వసాధారణంగా మారింది. దీంతో డీలర్ల అక్రమాలు అరికట్టి బియ్యం నిల్వలపై సమగ్ర సమాచారం రాబట్టేందుకు జిల్లా పౌరసఫరాల శాఖ ప్రతి నెలా 13వ తేదీ నాటికి డీలర్ల వద్ద మిగులు నిల్వల సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
రెండు మాసాల నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని అధికారులు ఇటీవల మరింత ఉధృతం చేశారు. జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాలు 2,082 ఉన్నాయి. 9.89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 30 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రతినెలా రేషన్ బియ్యం లక్షా 80 వేల క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయగా జూలైలో 1500 క్వింటాళ్లు మిగులు ఉన్నట్లు డీలర్లు లెక్కలు సమర్పించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం డీలర్లపై నిఘా మరింత పెంచడంతో ఆగస్టుకు వచ్చే సరికి 2,238 క్వింటాళ్లకు పెరిగింది.
సచ్ఛీలురూ వీరే....
ఈ నెలలో లక్షా 80 వేల క్వింటాళ్లు డీలర్లకు సరఫరా చేశారు. దీంట్లో లబ్ధిదారులకు పం పిణీ చేయగా డీలర్ల వద్ద 2,238 క్వింటాళ్లు మిగులు ఉన్నట్లు తేలింది. దీంట్లో తమ వద్ద గింజ బియ్యం కూడా నిల్వ లేదని 14 మంది డీలర్లు లెక్కలు సమర్పించారు. క్వింటాకు తక్కువ బియ్యం నిల్వలు కలిగిన దుకాణాలు 50 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అతితక్కువ బియ్యం నిల్వలు ఉన్న మండలాల్లో చిట్యాల మండల పరిధిలోని దుకాణాల్లో 14 క్వింటాళ్లు, పెద్దవూర మండలంలో 19 క్వింటాళ్లు, బీబీనగర్ మండలంలో 8 క్వింటాళ్లు, సూర్యాపేట 12 క్వి ంటాళ్లు, అర్వపల్లి 13 క్వింటాళ్లు, మర్రిగూడ మండల పరిధిలోని దుకాణాల్లో 10 క్వింటాళ్లు మాత్రమే బియ్యం నిల్వలు మిగిలి ఉన్నట్లు పౌరసరఫరాల శాఖకు లెక్కలు ఇచ్చారు.
నేటినుంచి విస్తృత తనిఖీలు...
జీరో బ్యాలెన్స్ దుకాణాలు, అతితక్కువ నిల్వలు కలిగిన రేషన్ దుకాణాలపై శుక్రవారం నుంచి జిల్లా యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహించనుంది. ఈ తనిఖీల్లో సరుకుల నిల్వలు తేలితే అక్కడికక్కడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ తనిఖీల అనంతరం కీ రిజిస్టర్ రూపొం దిస్తారు. ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లో డీలర్లందరూ బియ్యం సహా అన్ని సరుకులకు ఒకేసారి డీడీలు చెల్లించాల్సి ఉం టుంది. మీ సేవా కేంద్రాల్లో ఎంటర్ అయిన దుకాణాల డీడీలను తహసీల్దార్లు పరిశీలించిన పిదప గోదాములకు పంపుతారు. అక్కడినుంచి డీలర్లుకు రేషన్ సరుకులు సరఫరా చేస్తారు. ఈ విధానం ద్వారా డీడీలు చెల్లించే క్రమంలో డీలర్లు రెండు సార్లు కాకుండా ఒకేసారి డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఒకేసారి సరుకులన్నీ దుకాణాలకు చేరుతాయి. లబ్ధిదారులకు పంపిణీ కూడా ఏకకాలంలో పూర్తవుతుంది.
మిగులు బియ్యం... 2 వేల క్వింటాళ్లు!
Published Fri, Aug 21 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement