సాక్షి, ఒంగోలు :
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పెద్దలు బొక్కేస్తున్నారు. డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూ టన్నుల కొద్దీ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు ఈ బియ్యాన్ని సేకరించి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. కొందరు రైస్ మిల్లర్లు సైతం వాటిని కొనుగోలు చేస్తూ మేలురకం బియ్యాన్ని కల్తీ చేసేందుకు, వాటిని కాస్త పాలిష్‌పట్టి తిరిగి లెవీ కింద ప్రభుత్వానికే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ తతంగం నిత్యం జరిగేదే అయినా..నిఘా విభాగాలు అప్పుడప్పుడూ దాడులు చేసి మమ అనిపిస్తున్నారు.
గత నెల 11వ తేదీ టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేసిన దాడిలో 219 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. అదే నెల 27వ తేదీన జిల్లాలోని కందుకూరు మండలం మాచవరంలో రైస్‌మిల్లులో 264 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత సోమవారం సాయంత్రం
పేదల బియ్యం పెద్దల భోజ్యం
Published Fri, Dec 13 2013 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement