
వదల బొమ్మాళీ..వదల..
సంతకవిటి/వీరఘట్టం టాస్క్‌ఫోర్సు : ఈ-పాస్ విధానం అమలు చేసి తీరాలని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఈ విధానం ద్వారా గత మూడు నెలలుగా సరుకులు పంపిణీలో విఫలమైన ప్రభుత్వం.. తెరపైకి కొత్త సర్వర్‌ను తీసుకువచ్చింది. రేషన్ లబ్ధిదారులు, డీలర్ల గగ్గోలును పెడచెవిన పెడుతోంది. ఈ పాస్ యంత్రాలకు గతంలో అనుసంధానం చేసిన ఏపీ ఆన్‌లైన్ సర్వర్‌ను పక్కనబెట్టి ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) సర్వర్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఐసీ ద్వారా సిగ్నల్స్ బాగా వస్తాయని, ప్రతి నెలా 5వ తేదీ లోగా సరుకుల పంపిణీ పూర్తి చేయవచ్చునని అధికారులు డీలర్లకు నచ్చజెపుతున్నారు.
కొత్త సర్వర్ పనితీరు అంతంత మాత్రమేఫిబ్రవరిఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఎన్‌ఐసీ సర్వర్ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. తొలి రోజే సర్వర్మోరాయించడంతోపలువురుడీలర్లుతహశీల్దార్కార్యాలయాలకుపరుగులుతీశారు.ఇలాఅయితేసరుకులుపంపిణీతమ వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. వలస కూలీలకు కొత్త కష్టాలు ఈ-పాస్ అమలు ద్వారా ప్రభుత్వానికి భారీగా రేషన్ సరుకులు మిగులుతున్నాయి. వలస కూలీలకు మాత్రం కొత్త కష్టాలు మొదలయ్యాయి. బయోమెట్రిక్ మిషన్‌పై వేలి ముద్ర వేస్తేనే రేషన్ సరుకులు అందుతాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లిన వసల కూలీలు రేషన్ సరుకుల కోసం ప్రతి నెలా స్వగ్రామాలకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. వంద రూపాయల సరుకుల కోసం నెల నెలా 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయని, రాకుంటే కార్డు రద్దవుతుందని వాపోతున్నారు.
భారీగా సరుకుల మిగులు మరోవైపు బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు పడని కారణంగా నెల నెలా భారీగా సరుకులు మిగులుతున్నాయి. సంతకవిటి మండలంలో 1400 కార్డులకు, పాలకొండ మండలంలో 2800 కార్డులకు, వీర ఘట్టంలో 2500 కార్డులకు గత మూడు నెలలుగా రేషన్ సరుకులు నిలిచిపోయాయి. జిల్లాలోని ప్రతి మండలంలో ఈ సమస్య ఉంది. కుష్ఠు వ్యాధిగ్రస్తులు, కదల్లేని రోగులకు ఒక్కో మండలంలో 110 నుంచి 130 మందికి మాత్రమే వీఆర్వో సమక్షంలో రేషన్ సరుకులు ఇస్తున్నారు. మిగిలిన సరుకులు ప్రభుత్వానికి చేరుతున్నాయి.