న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తాజాగా యూనియన్ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ డీలర్లకు యూనియన్ బ్యాంక్ రుణ సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు మారుతీ విక్రయ శాలల్లో వాహనాల నిల్వకు కావాల్సిన నిధుల సమీకరణ అవకాశాలను ఈ భాగస్వామ్యం మెరుగుపరుస్తుందని సంస్థ మంగళవారం ప్రకటించింది.
డీలర్ నెట్‌వర్క్‌ను పెంపొందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2008 నుంచి మారుతీ సుజుకీ, యూనియన్ బ్యాంక్ మధ్య బంధం కొనసాగుతోంది. 3,00,000 పైచిలుకు కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ వాహన రుణం సమకూర్చింది.
Comments
Please login to add a commentAdd a comment