Rajender Kumar
-
ఆడమ్స్ ఈ బైక్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్
హైదరాబాద్: ఆడమ్స్ ఈ బైక్ సూపర్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్ సంస్థ వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో కేఆర్ఫుడ్స్ సంస్థ ఎండీ రాజేందర్ కుమార్ కొత్తపల్లి మాట్లాడుతూ... ‘‘తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆడమ్స్ ఈ బైక్స్ సూపర్ స్టాకిస్టుగా బాధ్యతలు తీసుకున్నాము. మెదక్ జిల్లాలో తుప్రాన్ మండల కేంద్రంగా 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించాము. ఈ ప్లాంట్ నెలకు 4 వేల ఈ బైకులను ఉత్పత్తి చేయగలదు. రోబోటిక్, ఆర్టిఫిషియల్ సాంకేతికతను సమకూర్చుకుంటూ ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని పదివేల యూనిట్లకు పెంచుతాము. ఇదే ప్లాంట్లులో అధిక హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము’’ అని తెలిపారు. -
కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్
ముజఫర్‌నగర్: కోడలు కాపురానికి రావడం లేదని పరువుతో మామ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ముజఫర్ నగర్‌లోని నివాసముంటున్న రాజేందర్ కుమార్(50) అనే వ్యక్తి ఈ మధ్యనే తన కుమారుడికి పెళ్లి చేశాడు. అయితే, కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన మామ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
14 లిక్కర్ బాటిళ్లు.. 26 లక్షల నగదు!
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్‌కు కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపిన రాజేంద్రకుమార్ కేసులో సీబీఐ మరిన్ని అనూహ్య విషయాలు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కార్యదర్శి అయిన రాజేంద్రకుమార్ ఇంట్లో 14 మద్యం బాటిళ్లు లభించాయని తెలిపింది. అదేవిధంగా ఆయన బ్యాంకులో రూ. 28 లక్షల నగదు లభించిందని, దానిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ వివరించింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరుపడం రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ చర్యకు పాల్పడ్డారని, ఆయనో పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ కేసుతో తమకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీబీఐ కూడా సోదాలపై వివరణ ఇచ్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వం రాకముందే రాజేంద్రకుమార్ అవినీతి చర్యలకు పాల్పడ్డారని, ఆయన వివిధ కంపెనీలకు టెండర్లు నిర్వహించకుండా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని, అందుకే ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిపినట్టు సీబీఐ తెలిపింది. ఆయన బ్యాంకులో 28 లక్షల నగదు దొరికిందని, అదేవిధంగా పరిమితికి మించి 14 మద్యం బాటిళ్లు ఆయన నివాసంలో లభించాయని, వీటిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది. అయితే రాజేంద్రకుమార్‌కు వ్యతిరేకంగా సీబీఐ వద్ద తగినంత సాక్ష్యాధారాలు లేవని కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నాయి.