
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల బ్యాటరీలతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఉదంతాల నేపథ్యంలో ఇలాంటి వాటిని నివారించేందుకు కెనడాకు చెందిన స్టార్టప్ సంస్థ మేకర్‌మ్యాక్స్ కసరత్తు చేస్తోంది.
బ్యాటరీల ప్రమాదాలను.. ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా టెస్టింగ్ పరికరాలు, అల్గోరిథమ్‌లు రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎం201 పరికరంతో బ్యాటరీ వాస్తవ ప్రమాణాలను .. దాని ప్రస్తుత పనితీరును విశ్లేషించి చూడవచ్చని, వ్యత్యాసాలేమైనా ఉంటే సత్వరం గుర్తించవచ్చని పేర్కొంది. తద్వారా అగ్నిప్రమాదాల ఉదంతాలను నివారించవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు అక్షయ్ తెలిపారు.
100 శాతం సురక్షితమైన బ్యాటరీలను తయారు చేయాలన్నది అందరి ఆకాంక్ష అయినప్పటికీ కోటిలో ఏదో ఒక బ్యాటరీలో తప్పకుండా సమస్యలు తలెత్తవచ్చని ఆయన వివరించారు.
"భారత్‌లో ద్విచక్ర వాహనాల్లో బ్యాటరీలను ఉంచే లోహపు బాక్సుల్లో తగినంత భద్రతా ఫీచర్లు ఉండటం లేదన్నారు. బ్యాటరీ నుండి వెలువడే వాయువులు తప్పించుకుపోయే మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అక్షయ్ చెప్పారు."
ఈ నేపథ్యంలో ఒత్తిడిని విడుదల చేయగలిగే వాల్వ్‌లు గల మూడు లేదా అంతకు మించి కంపార్ట్‌మెంట్లలో బ్యాటరీలను ఉంచవచ్చని పేర్కొన్నారు.
చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు!
Comments
Please login to add a commentAdd a comment