భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఊపందుకుంది. అధిక ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలే కాకుండా భారత్‌లో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా కొనుగోలుదారులకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కాగా వెస్ట్‌బెంగాల్‌కు చెందిన గోజీరో మొబిలిటీ(GoZero Mobility) సరికొత్త ఆఫర్‌ను అందించనుంది.
పాత సైకిల్‌ను ఇస్తే..!
ఈ-బైక్స్‌పై అమ్మకాలను మరింత పెంచేందుకుగాను గోజీరో మొబిలిటీ "స్విచ్" అనే ఒక ఎక్సేచేంజ్ ప్రమోషన్‌ను మొదలు పెట్టింది. ఈ ప్రచారంలో భాగంగా కస్టమర్స్ ఏదైనా సంప్రదాయ సైకిల్‌తో కంపెనీకి చెందని ఎలక్ట్రిక్ ఈ-బైక్‌తో ఎక్సేచేంజ్ చేసుకోవచ్చునని గోజీరో పేర్కొంది. "స్విచ్" ప్రమోషన్స్‌లో భాగంగా...రూ. 7,000 నుంచి రూ. 25 వేల విలువైన ఏదైనా బ్రాండ్‌కు చెందిన సైకిల్‌తో కొత్త ఈ-బైక్‌ను సొంతం చేసుకోవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ 2022 జనవరి 10 నుంచి 2022 ఏప్రిల్ 9 వరకు చెల్లుబాటులో ఉండనుంది.
ఎక్సేచేంజ్‌తో సేకరించిన సైకిళ్లను తిరిగి ఈ-బైక్స్‌గా మార్చుతామని కంపెనీ సహావ్యవస్థాపకుడు సుమిత్ రంజన్ అన్నారు. గోజీరో స్విచ్ ప్రచారంలో ఎలక్ట్రిక్ వన్, సారధి ట్రేడర్స్, గ్రీవ్స్ ఈవీ ఆటోమార్ట్,ఆర్యేంద్ర మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. వీరి భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా గోజీరో ఈ-బైక్ అమ్మకాలను జరుపుతోంది. GoZero X-సిరీస్ ఈ-బైక్స్ ధర రూ. 34,999 నుంచి రూ. 45,999గా ఉండనున్నాయి.
చదవండి: టయోటా హైబ్రిడ్ కార్ సరికొత్తగా..! పెట్రోల్‌తోనే కాదు కరెంటుతో కూడా నడుస్తోంది..! ఈ కారు..!
Comments
Please login to add a commentAdd a comment