హీరో.. 4 కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు
• ధరలు రూ.42,000-రూ.83,000
• 4 గంటలు రీచార్జ్ 50 కి.మీ. ప్రయాణం
న్యూఢిల్లీ: హీరో సైకిల్స్ కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ సెకిళ్లను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ పెడల్ అసిస్టెడ్ టెక్నాలజీ సైకిల్(ఈప్యాక్)ను లెక్ట్రో బ్రాండ్ కింద అందిస్తున్నామని హీరో సైకిల్స్ తెలిపింది. ప్రస్తుతం నాలుగు మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని, వీటి ధరలు రూ.42,000 నుంచి రూ.83,000 రేంజ్‌లో ఉన్నాయని కంపెనీ సీఎండీ పంకజ్ ముంజాల్ చెప్పారు. ఈ మోడల్ సైకిళ్లలో బ్యాటరీని విడిగా బయటకు తీసుకోవచ్చని, నాలుగు గంటలు రీచార్జ్ చేస్తే 50 కిమీ దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ సైకిళ్లను మొదటగా బెంగళూరు, పుణే, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సైకిళ్లలో త్వరలో 20 మోడళ్లను అందిస్తామని వివరించారు.