హీరో సైకిల్స్‌ ‘లెక్ట్రో’ బ్రాండ్‌ | Hero Bicycles Launches New Electric Assist Bicycle Brand Lectro | Sakshi
Sakshi News home page

హీరో సైకిల్స్‌ ‘లెక్ట్రో’ బ్రాండ్‌

Published Wed, May 31 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

హీరో సైకిల్స్‌ ‘లెక్ట్రో’ బ్రాండ్‌

హీరో సైకిల్స్‌ ‘లెక్ట్రో’ బ్రాండ్‌

హైదరాబాద్‌: సైకిళ్ల తయారీ దిగ్గజం హీరో సైకిల్స్‌ భారత మార్కెట్లో లెక్ట్రో బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి ఇది తొలి యూరోపియన్‌ బ్రాండ్‌ కావడం విశేషం. ఎలక్ట్రిక్‌ పెడల్‌ అసిస్టెడ్‌ సైకిళ్ల (ఈపీఏసీ) విభాగంలో లెక్ట్రో సంచలనం సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది. హీరో ప్రస్తుతం నాలుగు మోడళ్లను విడుదల చేసింది.

త్వరలోనే ఈ సంఖ్యను 20కి చేర్చనుంది. హైదరాబాద్‌లోనూ ఇవి లభిస్తాయి. భారత్‌లో ఈపీఏసీ విభాగం ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోందని హీరో సైకిల్స్‌ సీఎండీ పంకజ్‌ ముంజాల్‌ తెలిపారు. పర్యావరణ అనుకూల సైకిళ్ల విక్రయాలకు దేశంలో మంచి భవిష్యత్‌ ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement